కారు కొనుక్కోవాలని ఎవరికుండదు? ఈ రోజుల్లో అంతగా సంపాదన లేని వాళ్ళు కూడా కేవలం షో కోసమే కారు కొనుక్కోవాలి అని తెగ సంబర పడిపోతూ వుంటారు. ఇక కొన్న వెంటనే వాళ్ళ హుషారు చూడాలి.. అయిన వాళ్ళ దగ్గర ఫోజులు కొడుతూ తెగ మురిసి పోతూ వుంటారు. ఇక కొందరు సీరియస్ గానే, అవసరం మేరకు కొంటారనుకో... ఇంతకీ అసలు విషయం ఏమంటే...
కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసేవారికి శుభవార్త. అదిరిపోయే బంపర్ ఆఫర్ తో ఫోర్డ్ ఇండియా మీ ముందుకు వస్తోంది. అవును... ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా కోవిడ్ 19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని, ప్రతికూల పరిస్థితుల్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక స్కీమ్ ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ థీమ్ ఏమంటే.. లోన్ తీసుకొని కారు కొనుగోలు చేసిన వారికి, తొట్ట తొలి ఆరు నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు.
మొదటి ఆరు నెలలు సదరు కస్టమర్లు జాలిగా ఎంచక్కా.. కారులో షికార్లు కొట్టొచ్చు. కానీ ఏడో నెల నుంచి కట్టాల్సిన EMI కట్టాల్సి ఉంటుంది మరి. ఇందులో ఫోర్డ్ సహా పలు కార్ల కొనుగోలుకు ఈ పథకం వర్తిస్తుందని ఫోర్డ్ సేల్స్ మేనేజర్ ఒకరు తెలిపారు. ఇకపోతే... జూలై 31 వరకు ఈ ఆఫర్ కస్టమర్ల అందుబాటులోకి రానుంది. రుణంపై 8.99 శాతం వడ్డీ మాత్రమే కంపెనీ విధిస్తుంది.
గమనిక:
కారు రుణాన్ని 5 ఏళ్ళ లోపు చెల్లించాల్సి ఉంటుంది.
ఎకోస్పోర్ట్స్ కారు కొనుగోలుపై ఈఎంఐ రూ.1727 (రూ.లక్షకు) నుంచి ప్రారంభం.
ఫోర్డ్ యాస్పైర్, ఫిగో లేదా ఫ్రీస్టైల్ వంటి మోడళ్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది.
కొనుగోలుదారులకు స్టెప్ అప్ ప్లాన్ పొందే వీలుంది. (ఈ ఆప్షన్ ఎంచుకున్న వారికి, ఫస్ట్ టైం EMI తక్కువగా చెల్లించే వీలుంది. తర్వాత క్రమ క్రమంగా EMI పెరుగుతూ వెళ్తుంది.)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి