కరోనా కష్ట కాలంలో 20 లక్షలకు పైగా పరీక్షలు చేసి దేశంలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసిన రాష్ట్రాల్లో ఏపీని ముందువరసలో నిలిపారు. కానీ పింఛన్ల పెంపు విషయంలో మాత్రం జగన్ సర్కార్ వైఖరి అర్థం కావడం లేదు. ప్రస్తుతం జగన్ సర్కార్ రూ.2,250 పింఛను ఇస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం 2,500 రూపాయల పింఛన్ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ నెల ప్రభుత్వం 2,250 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చింది.
తాము అధికారంలోకి వస్తే పింఛను సొమ్మును ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైంది. పింఛన్ అందుకునే వాళ్లకు ఎప్పటినుంచి పెంపు వర్తిస్తుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం వైపు నుంచి పెన్షన్ల పెంపు గురించి ఎలాంటి వివరణ రాలేదు. జగన్ సర్కార్ 250 రూపాయలు ఎందుకు పెంచట్లేదు...? అనే ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
కరోనా వల్ల ఏపీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా జగన్ సర్కార్ ఆలస్యంగా జీతాలను చెల్లిస్తోంది. ప్రభుత్వం తరపు నుంచి పెన్షన్ల గురించి కనీసం స్పష్టత రావాల్సి ఉంది. ఎప్పటినుంచి పెన్షన్ల పెంపు అమలు చేస్తుందో వివరణ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం కరోనా ఉధృతి తగ్గే వరకు పెన్షన్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదని... రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాతే పెన్షన్ల పెంపు అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి