ఈ మధ్యకాలంలో వివాహ బంధానికి విలువ లేకుండా పోతుంది. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే మనస్పర్థల తో విడిపోతున్నాయి ఎన్నో  జంటలు. కేవలం వేరు వేరుగా ఉండడమే కాదు రెండో  పెళ్లిళ్లు చేసుకుని హాయిగా జీవనం సాగిస్తుండడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మొదట పెళ్ళి చేసుకున్న  భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయింది మహిళా . తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది  . రెండో భర్తతో హాయిగా జీవనం సాగిస్తోంది. ఇది మాజీ భర్త కు నచ్చలేదు. మాజీ భార్య రెండో భర్త తో హాయిగా ఉండడం చూసి భరించలేకపోయాడు. చివరికి తన రెండో భార్యతో కలిసి దారుణానికి  ఒడిగట్టాడు ఇక్కడ ఒక వ్యక్తి.



 మొదటి భార్య కూతురు ని హత్య చేశాడు. దారుణ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది  వివరాల్లోకి వెళితే... మైసూరు జిల్లాలోని చామరాజనగర్ కి చెందిన మహేష్ అదే ప్రాంతానికి చెందిన గౌరమ్మ తో వివాహం జరిగింది. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నప్పటికీ తర్వాత కాపురంలో కలహాలు మొదలయ్యాయి  ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. అయితే అప్పటికే వీరికి ఒక బిడ్డ ఉండడం గమనార్హం. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరూ వేరు వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో సమీప ఇళ్ళల్లోనే నివాసముంటున్నారు.


 అయితే మహేష్ రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ సంతానం మాత్రం కలగలేదు. కానీ మాజీ భార్య గౌరమ్మ మాత్రం తన రెండో భర్తతో ఎంతో హాయిగా ఉంటుంది. మాజీ భార్య సంతోషాన్ని చూసి  భర్త ఓర్వ లేక పోయాడు. ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు. తనకు పిల్లలు లేరు అన్న కడుపుమంటతో ఏకంగా దారుణానికి ఒడిగట్టాడు మహేష్. ఏకంగా ఉన్మాదిలా మారిపోయాడు. మాజీ భార్య సంతానం అయిన మహాలక్ష్మిని కిరాతకంగా హత్య చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు  తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: