గుంటూరు జిల్లా టీడీపీకి కాస్త అనుకూలమైన జిల్లా..ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. 2014 ఎన్నికల్లో సైతం టీడీపీ బాగానే సీట్లు దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 12 టీడీపీ గెలిస్తే, 5 వైసీపీ గెలిచింది. ఇక మూడు ఎంపీ సీట్లు టీడీపీనే గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లోనే టీడీపీ ఘోరంగా దెబ్బతింది. జగన్ వేవ్‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 2 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుకు మాత్రమే పరిమితమైంది.

అయితే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు కష్టపడుతూనే ఉన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం యాక్టివ్‌గా ఉండేవారు కాదు. దీని వల్ల వైసీపీ డామినేషన్ ఉండేది. ఇక ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిందో, అప్పటి నుంచి జిల్లాలో టీడీపీకి కాస్త అనుకూలత ఏర్పడింది. టీడీపీ అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేయడం, ఈ జిల్లా ప్రజలు అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుకోవడంతో వైసీపీ మీద వ్యతిరేకిత పెరిగినట్లు కనిపిస్తోంది.

దీనికి తోడు ఇటీవల బాబు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులని నియమించారు. గుంటూరులో ఉన్న మూడు పార్లమెంట్ స్థానాలకు అధ్యక్షులని పెట్టారు. గుంటూరుకు శ్రావణ్ కుమార్‌ని పెడితే, నరసారావుపేటకు జి‌వి ఆంజనేయులు, ప్రకాశంలో నాలుగు, గుంటూరులో మూడు అసెంబ్లీ స్థానాలు ఉండే బాపట్ల స్థానానికి ఏలూరి సాంబశివరావుని నియమించారు. ఇందులో ఏలూరి, జి‌విలు కమ్మ సామాజికవర్గానికి నేతలు. శ్రావణ్ కుమార్ మాత్రం దళిత సామాజికవర్గానికి చెందిన నేత.

పక్కాగా వ్యూహంతోనే బాబు అధ్యక్ష పదవిలని ఇచ్చారని తెలుస్తోంది. ఈ సమీకరణలతోనే గుంటూరులో టీడీపీకి కాస్త ఎడ్జ్ వచ్చినట్లు తెలుస్తోంది. పైగా అమరావతి విషయం బాగా కలిసొస్తుంది. ఇంకా నాయకులు కూడా బాగా యాక్టివ్ అయ్యారు. దీంతో గుంటూరులో టీడీపీకి కాస్త పాజిటివ్ ఉందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: