కరోనా  వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న  ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం పట్టిపీడిస్తోంది ఈ మహమ్మారి. ఎన్ని  నియంత్రణకు చర్యలు తీసుకున్న ముందు జాగ్రత్తలు తీసుకున్న ఎక్కడ ఉపయోగం లేకుండాపోతుంది. ఏదో ఒక విధంగా పంజా విసురుతున్న ఈ మహమ్మారి వైరస్ అందరి పై పంజా విసురుతుంది  . రోజురోజుకు  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ సామాన్య ప్రజలపై పంజా విసరడం ఒక ఎత్తయితే ప్రజలకు ధైర్యం చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న వైద్యులు ప్రజాప్రతినిధులపై  కూడా ఈ మహమ్మారి వైరస్ పంజా విసరడం సంచలనంగా మారిపోతుంది.



 ఇలా రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న ప్రజాప్రతినిధులు వైద్యులు ముఖ్య అధికారులు కూడా ఎక్కువైపోతున్నారన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ బెడద పెరిగి పోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ధైర్యం చెప్పేవాళ్లే ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడుతుండటం తో ప్రజలందరిలో మరింత ఆందోళన పెరిగిపోతుంది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి జరగబోయే పరిణామాల గురించి కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుపుతూ అవగాహన కల్పిస్తూ ధైర్యం నింపుతూ ఉన్న విషయం తెలిసిందే.


 ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్  హోమ్ క్వారంటైన్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే టెడ్రోస్ అథనోమ్ కరోనా  వైరస్ బారిన పడక పోయినప్పటికీ ఇటీవలే ఆయన స్నేహితుడు కరోనా  వైరస్ బారిన పడ్డాడు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఆయన హోమ్ క్వారంటైన్ లోకి  వెళ్లారు. అయితే తనకు ఎలాంటి కరోనా  వైరస్ లక్షణాలు లేవని కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో  ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: