బీహార్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీహార్ ఎన్నికల్లో విజయాన్ని అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్ని పార్టీలు మొన్నటివరకు ముమ్మర ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే. ఓటర్ మహాశయులనీ ఆకట్టుకునేందుకు ఎన్నో విభిన్నమైన హామీలను కూడా ఇచ్చాయి  ఆయా పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయాన్ని సాధించి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఎన్డీయే కూటమిని చీల్చి  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు.



 కాగా ఇక మూడు విడతల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరుగిన  విషయం తెలిసిందే. ఎంతో మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల వద్దకు బారులు తీరుతున్నారు. అయితే సాధారణంగా అయితే నేటి కాలంలో కొంచెం కష్టం అనిపించింది అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది వెనక అడుగు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎవరు గెలిచినా మనకు వచ్చేది ఏముందిలే అనుకుంటూ నిర్లక్ష్యం వహిస్తుంటారు ఓటు వేయడానికి.


 కానీ కొంతమంది ప్రజలు మాత్రం  అష్టకష్టాలు పడి అయినా సరే ఓటు వేయడానికి పోలింగ్ బూత్ ల వద్ద కు తరలి వస్తుంటారు. ఇక్కడ ఓ  ప్రాంత ప్రజల ఓటు వేయాలనే సంకల్పం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఓటు వేసేందుకు బీహార్లోని దర్భంగా ప్రజలు చూపిన చొరవ ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటోంది. దర్భంగా ప్రాంతానికి చెందిన ఐదు వేల మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలు చేరుకోవడానికి నది దాటడం తప్పనిసరి. ఇక ఎలాగైనా ఓటు వేయాలని అందరూ కలిసి ఓ వినూత్న ఆలోచన చేసి తాత్కాలికంగా కర్రలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాస్త ప్రమాదం అని తెలిసినప్పటికీ ఈ వంతెనపై వెళ్లి ఓటు వేసి వచ్చిన వారిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: