కరోనా వైరస్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టి దాదాపు సంవత్సరం కావస్తున్నా.. తన విలయ తాండవాన్ని  కొనసాగిస్తూనే ఉంది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ మొదలయ్యి వ్యాప్తి వేగంగా కొనసాగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వ్యాప్తి వేగం తక్కువగానే ఉంది. దీనికి కారణం అక్కడి ప్రజల నిర్లక్ష్యం అనే చెప్పాలి. రాను రాను కరోనా వైరస్ అంటే భయం తగ్గుతోంది అందుకే కోవిడ్ 19 రెచ్చిపోతూ తన వేగాన్ని పెంచుతోంది. యూరప్‌ వంటి దేశాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి మరి కరోనా అవగాహన కల్పిస్తూ ఉన్న కొందరు ప్రజలు వాటిని పెడచెవిన పెడుతున్నారు. తద్వారా కేసుల సంఖ్య పెరుగుతోంది.

 బ్రిటన్‌లోనైతే కొందరు రహస్య పార్టీలు, రేవ్‌ పార్టీలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాను విస్మరించి పార్కుల వెంట, పబ్బుల వెంట తిరుగుతూ కోవిడ్ 19 వ్యాప్తికి కారణమవుతున్నారు. చాలా మంది ప్రజలు కనీసం మాస్కు ధరించాలి అనే విషయాన్ని కూడా మరచి వారి కార్యక్రమాల్లో నిమగ్నమై పోతున్నారు. అయితే బ్రిటన్‌ ప్రజల ఉద్దేశాలకు వారి ప్రవర్తనకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్న కారణంగానే కరోనా నివారణ చర్యల లెక్క తప్పుతోందని, దీన్ని ఆంగ్లంలో ‘ఇంటెన్షన్‌–బిహేవియర్‌ గ్యాప్‌’ అంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటువంటి వారికి పదే పదే చెప్తేనే లాభం ఉంటుందని.. ప్రజలు ప్రభుత్వం చెప్పే సూచనలను .. హెచ్చరికలను పెడ చెవిన పెడుతుంది కదా అని వారిని అలా వారి సొంత నిర్ణయానికి వదిలి పెట్టరాదు, పదే పదే పటిష్టంగా హెచ్చరికలు చేస్తూ... తరచూ సూచనలు అందిస్తుంటేనే ప్రజల ప్రవర్తనలో మార్పు వస్తుంది.

 ఇందుకు మంచి ఉదాహరణ వియత్నాం ప్రభుత్వం అని అంటున్నారు. కరోనా జాగ్రత్తల పట్ల పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు జరిపించడానికి అక్కడి ప్రభుత్వం అన్ని సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చిందని.... తద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గింది. మృతులు సంఖ్య కూడా గణనీయంగా  తగ్గిందని చెబుతున్నారు. అంతేకాదు వియత్నాం ప్రచారంలో భాగంగా రూపొందిన ఓ పాప్‌ సాంగ్‌ కూడా ఎంతో ప్రభావాన్ని చూపిందని.... ప్రజల్లో మార్పు తీసుకు వచ్చిందని సమాచారం. ఈ విషయంలో జర్మనీ, న్యూజిలాండ్‌ దేశాలు కూడా విజయం సాధించడానికి వాటి పటిష్టమైన కమ్యూనికేషన్ల వ్యవస్తే కారణమని ‘పీఆర్‌ ప్రొఫెషనల్స్‌’ సర్వేలో బయటపడింది. కాబట్టి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు కదా అని ప్రభుత్వం వదిలేయకూడదు.... పలుమార్లు పలు విధాలుగా ప్రయత్నించడం వలన ప్రజల్లో అనుకున్న మార్పు చూడగలం.

మరింత సమాచారం తెలుసుకోండి: