ఈ మధ్య కాలం లో తరచూ వివిధ కూర గాయల ధరల్లో వస్తున్న మార్పులు రైతులను అయోమయం లో పడేస్తూ  దిక్కు తోచని స్థితిలో పడేస్తున్నాయి అనే విషయం తెలిసిందే.  అప్పటి వరకు భారీగా ధరలు పలుకుతున్నాయి రైతులందరూ సంబరపడే లోపే ఇక ఆ తర్వాత ఒక్కసారిగా డిమాండ్ పడిపోవడంతో ఇక ఆయా కూరగాయల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో చివరికి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇటీవలే టమాటా రైతుల పరిస్థితి ఇలాగే మారిపోయింది. మొన్నటి వరకు మార్కెట్లో టమాటా కొనాలంటే ధరలు భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.



 టమాటా కొరత భారీగా ఏర్పడడంతో మార్కెట్లో టమాటా కి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో టమాట ధరలు ఆకాశాన్నంటాయి. ఇక దీంతో టమాటా రైతులు లాభాలు వచ్చాయని పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ లాభ పడవచ్చని సంబరపడిపోయారు. కానీ అంతలోనే వారి ఆశలు కాస్తా ఆవిరిగా మారిపోయాయి.  ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో టమాటా రైతులు అందరు ఆందోళనలో మునిగిపోతున్నారు.  అయితే మొన్నటి వరకు ఆకాశాన్నంటిన టమాట ధరలు ఇప్పుడు దారుణ స్థితికి పడిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి.



 కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాట ధర కనీసం ఒక్క రూపాయి కూడా పలకకపోవడంతో ఇక రైతులందరూ మార్కెట్కు తీసుకొచ్చిన టమాటాలనురోడ్డుపై పారబోయాల్సిన  పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇక టమాటా పంట వేసేందుకు వేలల్లో పెట్టుబడి పెట్టి ప్రస్తుతం టమాటా కు సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని టమాటా రైతులు అందరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిట్టుబాటు ధర కల్పించి టమాటా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు టమాటా రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: