మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘోరంగా పరాజయం పాలవడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. వాటిలో..ఒకటి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీకాగా.. మరొకటి టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ రెండు విద్యావంతులకు సంబంధించినవే.. అలాంటిది ఈ రెండు ఎన్నికల్లోనూ బిజెపి పరాజయం పాలవడం చూస్తుంటే.. విద్యావంతుల్లో మోడీపై వ్యతిరేకత మొదలైనట్లు తెలుస్తోంది. ఆయన హవా ఇక్కడ సాగడం లేదని అర్థమవుతోంది. ఏకంగా వారణాసి ఎన్నికల్లో ఇంత దారుణంగా మోడీ ఓడిపోవడం చూస్తుంటే... భవిష్యత్తులో 2023 లో బీజేపీ పరిస్థితి ఏంటి..?? 2023 ఎన్నికల్లో బిజెపికి ఓటమి తప్పదా..?? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..!
ఇటు మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోవడం మోడీ కి పెద్ద షాక్ తగిలినట్లయింది. మరోవైపు హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తాజాగా బీజేపీ ఓటమిని ఎదుర్కోవడం గమనార్హం... ఇలా మెల్లమెల్లగా మోడీ వేవ్ తగ్గుతుందనే చెప్పాలి. ఇక దుబ్బాక ఎన్నికలతో తెలంగాణలో బలం పెంచుకుంటున్న బిజెపి... ఆతర్వాత గ్రేటర్ ఎన్నికలతో తన సత్తా చాటింది.... కానీ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మోడీ పాలనలో ముందుకు నడుస్తున్న బీజేపీకి అడుగడుగునా బ్రేకులు పడడం చూస్తుంటే.... ఆ ప్రభావం ఇక్కడ తెలంగాణలోను పడేలా ఉంది అంటున్నారు. మోడీని నెత్తిన పెట్టుకున్న ఉత్తర భారత ప్రజల్లోనే ఆయన పై వ్యతిరేకత మొదలు అవుతుంటే.... ఇక రానురాను తెలంగాణలోనూ బిజెపికి అదే పరిస్థితి ఎదురవుతుంది అని అంచనా వేస్తున్నారు రాజకీయ మేధావులు. మరి మోడీ మరింత ముందుచూపుతో సమస్యలన్నింటినీ చక్క పెడతారో లేక కాలంతో రాజీ పడతారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి