చైనా చేసిన తప్పుల వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలం కావాల్సి వస్తోంది. గబ్బిలాల గుహలపై చైనా చేసిన పరిశోధనలే కరోనా వ్యాప్తికి కారణం అని తెలుస్తోంది. కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రపంచంపై ఆధిపత్యం కోసం మంచి చెడు అని చూడకుండా చైనా చేసిన పనులు.. ప్రపంచానికి ముప్పుగా మారాయి. డ్రాగన్ కంట్రీ ఆగడాలతో అన్ని దేశాలు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. ప్రమాదకర గబ్బిలాల గుహలపై చైనా సైంటిస్ట్ లు చేసిన పరిశోధనలు.. ఇప్పుడు ప్రపంచ మొత్తం సరిగ్గా ఊపిరి తీసుకోలేని పరిస్థితికి కారణం అయ్యాయి. కరోనా వైరస్ పుట్టుకపై డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న విచారణలో చాలా నిజాలు బయటపడుతున్నాయి.

గబ్బిలాల గుహల్లోకి వెళ్లి లైవ్ వైరస్‌లపై పరిశోధన చేసే చైనా శాస్త్రవేత్తలు చాలా అజాగ్రత్తగా ప్రవర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ విచారణలో తేలింది. డబ్ల్యూహెచ్ఓ నిబంధనలను పాటించకుండా చైనా ఈ ప్రయోగాలు చేపట్టింది. కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదు. గ్లోవ్స్, మాస్క్‌లు ధరించకుండానే గుహలో చైనా సైంటిస్ట్స్ నమూనాలు సేకరించారు.

గుహలో పరిశోధన చేస్తున్న సమయంలో కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు అంగీకరించారు. దీంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా వైరస్ సోకిన గబ్బిలాలకు ఈ గుహ కేంద్రంగా  ఉంది.

డబ్ల్యూఐవీ చాలా  రహస్యంగా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. పరిశోధనలకు వెళ్లినప్పుడు తన రబ్బర్ గ్లోవ్స్‌లోకి ఓ గబ్బిలం కోర సూదిలాగా గుచ్చుకుందని డబ్ల్యూఐవీ సైంటిస్ట్ చెప్పారు. ఈ సంఘటన 2017లో జరిగిందని ఆ శాస్త్రవేత్త తెలిపారు.

ఈ విషయాలన్నీ ఓ చైనీస్ టీవీ సిబ్బంది సేకరించిన వీడియోలో బయటపడ్డాయి. ఈ వీడియో 2017లోనే ప్రసారమైంది. ఓ శాస్త్రవేత్త తన చేతులకు ఎలాంటి గ్లోవ్స్ లేకుండా గబ్బిలాన్ని పట్టుకున్నట్లు వీడియోలో ఉంది. మరో రీసెర్చర్ గబ్బిలం కోర తన చేతికి గుచ్చుకుందని చెప్పారు. దీంతో ఈ శాస్త్రవేత్తలకు అప్పట్లోనే కరోనా వైరస్ సోకిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ వైరస్ అలా వ్యాప్తి చెంది కోవిడ్-19గా మారి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తికి చైనానే కారణం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానిపై దర్యాప్తు చేసేందుకు ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ బృందం వూహన్‌లో పరిశీలిన చేపడుతోంది. కోవిడ్-19 వ్యాధికి కారణమైన నోవల్ కరోనా వైరస్‌ మొదట వూహన్‌లోనే బయపడింది. డబ్ల్యూహెచ్ఓ టీమ్ మరింత క్షుణ్ణంగా పరిశీలన చేపడితే చాలా రహస్యాలు బయటపడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: