రాష్ట్రంలో వారానికోసారి చ‌ర్చిల‌కు వెళ్లి ప్రార్థ‌న‌లు చేసే పాస్ట‌ర్ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూ.5000 చొప్పున నెల‌నెలా పింఛ‌ను ఇస్తోంది. ఇక‌, మౌజ‌న్ల‌కు కూడా నెల‌నెల రూ.5 వేల చొప్పున పింఛ‌న్లు ఇస్తోంది. ఇదే స‌మ‌యంలో నిత్యం ఉద‌యం తెల్ల‌వార‌క ముందుగానే ఆల‌యాల‌కు వెళ్లి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఆదివారం, సెల‌వు కూడా లేకుండానే నిత్యం కైంక‌ర్యాలు చేసే పూజారుల‌కు కూడా ప్ర‌భుత్వం రూ.5000ల‌నే పింఛ‌నుగా నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. ఇదేం నీతి! అని అన‌కూడ‌దు.. అంటే.. శ్రీకాకుళం జిల్లాలోని ఓ పూజారి గంజాయి అమ్ముతున్న‌ట్టుగా ఇత‌రుల‌పై కూడా కేసులు న‌మోదు చేస్తారు! ద‌టీజ్ ఏపీ మార్కు రాజ‌కీయం.

దేవుడిని న‌మ్ముకుని, నిత్యం దైవారాధ‌న‌లోనే ఉండే పూజారులు రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష మంది ఉన్న‌ట్టు దేవ‌దాయ శాఖ వ‌ర్గాలు చేసిన స‌ర్వేలో నివేదిక పేర్కొంది. వీరిలో కేవ‌లం 20 వేల మంది మాత్ర‌మే ప్ర‌ధాన ఆల‌యాల్లో విధులు నిర్వ‌హిస్తున్నారు. మిగిలిన వారంతా కూడా చిన్నా చిత‌కా ఆల‌యాల్లో పూజారులుగా కొన‌సాగుతున్నారు. వీరికి ఆల‌యాల్లో వ‌చ్చే ఆదాయం అంతంత మాత్రం. కేవ‌లం ప్ర‌భుత్వం ఇచ్చే పింఛ‌నుతోనే ధూప‌దీప నైవేద్యాలు నిర్వ‌హించి.. కుటుంబాన్ని పోషించుకోవాలి. మ‌రి ఇది ఎలా స‌రిపోతుందో స‌ర్కారు పెద్ద‌లు ఆలోచించుకోవాలి.

గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కారు ఉన్న‌ప్పుడు.. ధూప‌దీప నైవేద్యాల‌కు నెల‌కు రూ.1000 చొప్పున అద‌నంగా ఇచ్చేవారు. ఇప్పుడ ఆ మొత్తాన్ని కూడా తీసేసి కేవ‌లం రూ.5 వేల‌కే స‌ర్కారు స‌రిపెట్టింది. దీంతో అటు ధూప‌దీప నైవేద్యాలకే ఈ మొత్తాన్ని అయ్యవార్లు స‌రిపెడుతున్నారు. పెరిగిన ధ‌ర‌ల నేప‌థ్యంలో ఈ మొత్తం కూడా స‌రిపోవ‌డం లేద‌ని.. వారు వాపోతున్నారు.

ఇక‌, ప్ర‌భుత్వం నుంచి అందించే వృద్ధాప్య పింఛ‌న్లు.. ఇత‌ర పింఛ‌న్ల‌ను ఈ 5000 ఇస్తున్నామ‌నే కార‌ణం చూపుతూ. వాటిని ఎత్తేశారు. ఇంత‌క‌న్నా దారుణం లేద‌ని అంటున్నారు పురోహితులు. అయితే.. రాష్ట్రంలో ఇంత జ‌రుగుతున్నా.. ఎవ‌రూ బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌ల‌పై పోరాడింది లేదు.. ప్ర‌భుత్వంతో చ‌ర్చించిందీ లేదు. సో.. ఇదీ ఏపీ రాజ‌కీయం!! 

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: