సైబర్ నేరగాళ్ల బారిన పడి దాదాపు నాలుగు లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి.. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.. చివరి సారి తన పిల్లలతో మాట్లాడాలని పించి.. ఆత్మహత్య చేసుకునే ముందు పిల్లలతో మాట్లాడి మరీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. పిల్లలు వద్దు నాన్నా.. వద్దు అని ఏడుస్తున్నా.. పట్టించుకోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూపరులకు కంట తడి పెట్టిస్తోంది..

ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి మండలం పోసానిపేట్‌కు చెందిన మంగళపల్లి లక్ష్మణ్ ‌  కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసముంటున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు... ఆరు నెలల క్రితం ‘కరోడ్‌పతి’ అయ్యారంటూ మొబైల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ‘మీరు రూ.కోటి గెలుచుకున్నారు.. ముందుగా కొంత డబ్బు చెల్లిస్తే గెలుచుకున్న మొత్తం మీ ఇంటికి చేరుతుందని అందులో చెప్పారు.

అది నమ్మి లక్ష్మణ్‌ లక్ష్మణ్‌ అప్పు చేసి ఆన్‌లైన్‌లో రూ.2.65 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత ఇలాగే మరో సైబర్ నేరానికి  రూ.2 లక్షలు పొగొట్టుకున్నాడు. డబ్బు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. స్మార్ట్‌ ఫోన్ ఆధారంగా ఎక్కువ మంది మోసాలకు పాల్పడుతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్ అప్‌ డేట్ చేస్తున్నాం.. మీ ఆధార్ నెంబర్ అప్‌డేట్ చేస్తున్నాం.. మీకు వచ్చిన ఓటీపీ చెప్పండి అంటూ బ్యాంకు సిబ్బందిలా ఫోన్లు వస్తుంటాయి.


పొరపాటున ఓటీపీ చెప్పేశారా.. అంతే సంగతులు. అలాగే.. మీ స్మార్ట్ ఫోన్‌కు వాట్సప్, మెస్సేజుల్లో అనేక లింకులు కనిపిస్తాయి. అవి ఎట్రాక్టివ్‌గా ఉంటాయి. అదేంటో చూద్దామని ఓపెన్‌ చేస్తే అంతే సంగతులు మీ ఫోన్ కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలాగే మీకు కోటి రూపాయలు లాటరీ వచ్చిందని మోసం చేసే సంస్థలూ పెరిగిపోతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇలాగే ప్రాణాల మీదకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: