షర్మిల ఆశ నెరవేరడం లేదా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. తెలంగాణ రాష్ట్రంలో క్రీయాశీలక రాజకీయ నాయకురాలిగా మారడానికి తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ ఒక కొత్త నినాదాన్ని తెరమీదకు తెచ్చి ఇక కొత్త పార్టీ పెడతాను అంటూ చెప్పింది.  అయితే ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షర్మిల సోదరుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవంతంగా దూసుకుపోతు  అధికారంలో కొనసాగుతున్నప్పటికీ షర్మిల కొత్త పార్టీ పెడతాను అంటూ ప్రకటించడం సంచలనంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతోంది అన్నది అర్థం అయిపోయింది. పార్టీ పెట్టేందుకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం షర్మిల కల నెరవేరడం లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చి రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే .



 అయితే జగన్ ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సమయంలో ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతే కాదు ఎంతో మంది పదవులను సైతం వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ షర్మిల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. షర్మిల పార్టీ పెడతాను అని చెప్పినప్పటికీ ఇక ఇతర  పార్టీల నుంచి షర్మిల పార్టీ లో చేరడానికి ఎవరు సిద్ధం కావడం లేదు అని అర్థమవుతుంది. చుట్టపుచూపుగా షర్మిల తో సంప్రదింపులు జరుపుతున్నారు తప్ప..  ఇక షర్మిల  పార్టీలో చేరి  క్రియాశీలక వ్యవహరించేందుకు ఇతర పార్టీల నేతలు మొగ్గు చూపకపోవడంతో ఇక షర్మిల కల నెరవేరడం లేదు అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: