ఏపిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలు అన్నీ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈ ఎన్నికల్లో ఎక్కడా జరగ కూడదని ఆలోచనతో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీలు బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ప్రచారం లో స్పీడ్ ను పెంచారు. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు అయిపోయింది. రెండు పార్టీలు ఎక్కడిక్కడ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కడప లో మాత్రం ఊహకు అందని రీతిలో ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి.


నిన్న నామా పత్రాల ఉపసంహరణ జరిగింది.. ఇక్కడ ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి. చా లా వరకు టీడీపీ నేతలు నామినేషన్ ను రద్దు చేసుకున్నారు. కాగా , బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలపై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. వైకాపా తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు పోటీ ఎక్కువగా ఉన్న వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లను మద్దతు కోరుతున్నారు. తెదేపా తరఫున ఆయా నియోజక వర్గ బాధ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.


కడప నగరపాలక సంస్థ, ప్రొద్దుటూరు, బద్వేలు పురపాలక సంఘాల్లో వైకాపా అభ్యర్థులకు రెబల్స్‌ నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది.నగరపాలక సంస్థలో ప్రచారం జోరందుకుంది. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, వైకాపా మేయరు అభ్యర్థి సురేష్‌బాబు గురువారం సాయంత్రం వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. వీరిద్దరూ 8వ తేదీ వరకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. తెదేపా అభ్యర్థులు బరిలో ఉన్న వార్డుల్లో ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, కృష్ణమూర్తి ప్రచారం నిర్వహిస్తున్నారు.. కొన్ని ప్రాంతాల్లో బీజేపి గట్టి పోటీని ఇస్తున్నారు. ఇప్పటికే కడప మొత్తం కాషాయం జెండాలు కూడా ప్రచారంలో జోరు పెంచాయి. ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: