శర వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ అందరిపై పంజా విసురుతుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది గర్భిణీ స్త్రీలు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అయితే మొన్నటి వరకు గర్భిణీలు కరోనా వైరస్ బారిన పడిన తర్వాత ఇక కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది అని వైద్యులు హెచ్చరించారు. కానీ ఆధునిక వైద్యంతో  గర్భిణీ స్త్రీ కరోనా బారిన పడినప్పటికీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మాత్రం వైరస్ రాకుండా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు సూచిస్తున్నారు వైద్యులు.  కానీ ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ఏకంగా వైద్యులనే అవాక్కయ్యేలా చేసింది.



 ఇప్పటివరకు ఏకంగా గర్భిణీ స్త్రీ  వైరస్ బారిన పడితే ఇక ప్రసవం తర్వాత శిశువుకు కూడా పాజిటివ్ రావడం లాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగులోకి వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా తల్లికి నెగిటివ్ వచ్చినప్పటికీ.. పుట్టిన శిశువుకు మాత్రం పాజిటివ్ రావడంతో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. అందరినీ అవాక్కయ్యేలా చేసిన ఈ ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. అనిల్ ప్రజాపతి అనే వ్యక్తి నెలలు నిండిన తన భార్య సుప్రియను బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిధిలోని ఎస్ఎస్ ఆస్పత్రికి తరలించారు.  ఈనెల 24వ తేదీన సదరు మహిళను ఆసుపత్రికి తరలించగా.. ఇక ప్రసవం జరిగే ముందురోజు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు వైద్యులు.


 రాపిడ్ టెస్ట్ తో పాటు ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేయగా.. సదరు మహిళకు నెగిటివ్ అని వచ్చింది. ఆ తర్వాత రోజే సదరు మహిళ ప్రసవం జరిగింది. ఇక ఆ తరువాత శిశువుకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్  రావడంతో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు.  తల్లికి కరోనా లేకుండా బిడ్డకు ఎలా వచ్చింది అని అవాక్కయ్యారు.  ముందురోజు తల్లికి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ వస్తే.. తర్వాత రోజే ఇక పుట్టిన శిశువుకు పాజిటివ్ ఎలా వచ్చిందో తెలియక డాక్టర్లు తలలు పట్టుకున్నారు. అయితే రిపోర్టులు తప్పుగా వచ్చి ఉండవచ్చు అని వైద్యులు భావిస్తున్నారు. మరోసారి ఇద్దరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: