ప్రస్తుతం మన దేశంలో కరోనా  సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుముఖం పట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలిచేలా కనిపించడం లేదు. త్వరలోనే థర్డ్ వేవ్  ముప్పు పొంచి ఉందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేసులు తగ్గుతున్నాయి కదా అని విచ్చలవిడిగా మళ్లీ రోడ్లపైకి వస్తే కరోనా మూడవ దశలో ప్రమాద స్థాయి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా మనదేశంలో అక్టోబర్ నెలలో కరోనా థర్డ్ వేవ్ మొదలు అయ్యే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  ఇందులో వాస్తవం ఉందా లేదా అని ఆలోచించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పలువురు సలహా ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుండే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి కరోనా మూడవ దశలో ప్రమాద స్థాయిని తగ్గించేందుకు పూర్తి చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

కావున ఇప్పటిలో లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన విరమించుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటి నుండే ప్రభుత్వాలు ఆలోచించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే థర్డ్ వేవ్ లో కరోనా ప్రభావం తగ్గించడమే కాకుండా పూర్తిగా నివారించే అవకాశం లేకపోలేదని వారు అంటున్నారు. ఇప్పుడు టీకాల పంపిణీ చాలా విలువైనదని వీలైనంత వేగంగా అందరికీ వ్యాక్సిన్ అందించడం ద్వారా కోవిడ్ తీవ్రత తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కరోనా మూడవ దశలో చిన్నారులే ఎక్కువగా కరోనా బారిన పడతారు అన్న అంచనాలను అంత సులభంగా తీసిపారేయకూడదని ప్రముఖ శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటి నుండే చిన్నారుల కోసం హాస్పిటల్లో ప్రత్యేక వసతులను, వైద్య సదుపాయాలను మెరుగు పరిచే చర్యలను చేపట్టాలని సూచిస్తున్నారు.

కరోనా మూడవ దశ ఉదృతి అంచనాలపై ప్రస్తావించిన 24 మంది నిపుణుల లో 21 మంది అక్టోబర్ లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొందరు వచ్చే ఏడాది మొదటి నెల చివరి వారంలో మొదలయ్యే అవకాశం ఉందని అనగా, మిగిలిన వారు ఈ ఏడాది ఆగస్టు లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇక మరొక కీలక విషయం ఏమిటంటే 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న  చిన్నారులపై కరోనా థర్డ్ వేవ్ ప్రభావం అధికంగా ఉండబోతోందని వీరు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: