కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి విద్యా సంస్థలు తెరుచు కోవడం కేవలం కల గానే మిగిలి పోయింది. అటు ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ విద్యా సంస్థలు తెరవాలను కుంటున్నాయ్. విద్యార్థుల భవిష్యత్తు పాడవ్వకూడదు అని ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసు కుంటున్నాయి.  కానీ కరోనా వైరస్ ప్రభావం తో చివరికి విద్యార్థుల ప్రాణాలు పణం గా పెట్ట లేక వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యం గా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యాసంస్థల తెరిచింది ప్రభుత్వం.



 కానీ కొన్ని రోజులు కూడా గడవక ముందే చివరికి విద్యాసంస్థలు మళ్ళీ మూత పడే పరిస్థితి వచ్చింది. రెండవ దశ కరోనా కేసుల సంఖ్య తెలంగాణ లో విపరీతం గా పెరిగి పోయింది. చేసేదేమీ లేక మళ్ళీ స్కూళ్లు పూర్తిగా మూసి వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఆ తర్వాతే కరోనా వైరస్ కేసులు ప్రమాద కర రీతిలో పెరిగి పోవడం తో ఇక వైరస్ కట్టడి కోసం రాష్ట్రం లో లాక్డౌన్ విధించింది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కరోనా కట్టడికి  ఎంతో సమర్థవంతంగా పనిచేసింది.  రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా అదుపులోకి వస్తుంది.



 అయితే రేపటి నుంచి లాక్ డౌన్ కొనసాగించాలా లేదా పూర్తిగా ఎత్తివేయాలా అనే దానిపై నేడు నిర్ణయం తీసుకోనుండి  తెలంగాణ క్యాబినెట్. అంతేకాకుండా నూతన విద్యా సంవత్సరం ప్రారంభించి విద్యా సంస్థలను తెరవాలి అనేదానిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీ నుంచి స్కూళ్ళు ప్రారంభించాలని క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ విద్యాసంస్థలు తెరవకూడదు అని భావిస్తే మరికొన్ని రోజులపాటు ఆన్లైన్ క్లాసులు కొనసాగించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: