సినిమా క్రిటిక్  గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కత్తి మహేష్ టాలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా ఎదిగాడు. అయితే కత్తి మహేష్ ఇటీవల కార్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మరణించారు. కాగా సోమవారం కత్తి మహేష్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలో పూర్తి చేశారు. కత్తి  అంత్యక్రియలకు ఆయన అభిమానులు పలువురు ప్రజా సంఘాల నాయకులు ఇండస్ట్రీకి చెందిన వారు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. కాగా అంత్యక్రియలకు ముందు మందకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ మృతిపై అనుమానాలున్నాయని మందకృష్ణ మాదిగ అన్నారు. కారులో కత్తి మహేష్ తో పాటు ప్రయాణించిన‌ సురేష్ అనే వ్యక్తికి ఒక్క గాయం కూడా అవ్వలేదని అదే అనుమానాలకు దారితీస్తుంది అని చెప్పారు. 

డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సురేష్ వైపు కారు నుజ్జు నుజ్జు అయింద‌ని కానీ అతనికి చిన్న గాయం కూడా కాకుండా పక్కన కూర్చున్న కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు కావడం అనుమానాలకు దారితీస్తుంది అన్నారు. అంతేకాకుండా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించిన నాటి నుండి అంతా బాగానే ఉందని.... కొద్దిరోజుల త‌ర‌వాత డిస్చార్జ్ అవుతారని ప్రకటించిన కొన్ని గంటల్లో మరణించాడని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కత్తి మహేష్ కు ప్రమాదం జరిగిన నాటి నుండి ఆస్పత్రిలో జరిగిన వైద్యం, మరణం వరకు సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను మందకృష్ణ కోరారు. గత కొన్నేళ్ల నుంచి కత్తి మహేష్ వైసిపి కి ప్ర‌చారం చేస్తున్నారని 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ గెలుపు కృషి చేశారని అన్నారు. ఇప్పుడు కత్తి మహేష్ మృతికి సంబంధించిన మిస్టరీని చేదించాల్సిన‌ బాధ్యత వైయస్ జగన్ కు ఉందని మంద‌కృష్ణ అన్నారు.

అంతే కాకుండా కత్తి మరణంపై సంబరాలు చేసుకుంటున్న వారి పై కూడా మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తి మహేష్ మర‌ణాన్ని ఇంత‌లా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మరణం వెనక వారి హస్తం ఉండి ఉంటుందని అని మందకృష్ణ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గత చరిత్రను గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ మహాత్మాగాంధీ మధ్య జరిగిన విషయాలను గుర్తు చేశారు. ఈ పోరాటంలో గాంధీని ప్రత్యర్థి గా భావించిన తాను ఆయన మృతి చెందితే కన్నీరు కాల్చినట్టు అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. తమ హృదయాలు  అలాంటివని మంద‌కృష్ణ వ్యాఖ్యానించారు. కానీ కత్తి మరణాన్ని చూసి కొందరు సంబరాలు చేసుకుంటే వాళ్ళని చూస్తే జాలేస్తుంది అని వ్యాఖ్యానించారు. వాళ్ళ అజ్ఞానాన్ని చూస్తే బాధగా ఉందని అన్నారు. ఇదిలా ఉండ‌గా మంద‌కృష్ణ కోరిన‌ట్టు వైసీపీకి ఎంతో సేవ చేసిన క‌త్తి మ‌హేశ్ మృతిపై జ‌గ‌న్ విచార‌ణ జ‌రిపిస్తారా లేదా అన్న‌ది ఇప్పుగు ఆస‌క్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: