ప్రస్తుతం తమ పాలసీదారుల కోసం ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాలసీదారుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నే ప్రస్తుతం వినూత్నమైన పాలసీలతో ఎప్పటికప్పుడు ముందుకు వస్తూ ఉంటుంది అయితే ఇప్పటికే ఎల్ఐసి ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. ఇక ఎల్ఐసి అందిస్తున్న పాలసీలలో జీవన్ ఉమంగ్ పాలసీ కూడా ఒకటి. ఎల్ఐసి అందిస్తున్న ఈ అద్భుతమైన పాలసీ తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చు పాలసీదారుడు. ఇది ఎండోమెంట్ పాలసీ కిందికి వస్తుంది.
ఎల్ఐసి కస్టమర్ ఈ పాలసీ తీసుకుంటే అటు లైఫ్ కవర్ తో పాటు డబ్బులు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఈ పాలసీ తీసుకోవడం ద్వారా పాలసీదారులు రెండు రకాల ప్రయోజనాలు పొందవచ్చు అన్నమాట. జీవన్ ఉమాంగ్ పాలసీ వల్ల కలిగే మరో బెనిఫిట్ ఏమిటి అంటే వంద ఏళ్ళ వరకు కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు 30 ఏళ్ళ వయసులో ఉన్న సమయంలో ఐదు లక్షలకు బీమా మొత్తాన్ని 30ఏళ్ల టర్మ్ తో పాలసీ తీసుకుంటే.. 1280 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. రోజుకి 40 రూపాయలు సేవ్ చేస్తే సరిపోతుంది. అంతేకాదు మీరు 15,20,25, 30 ఇలా మీకు నచ్చిన విధంగా మీ పాలసీ టర్మ్ ఎంచుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు అంటే 30 ఏళ్లలో పాలసీ తీసుకునే 30 ఏళ్లు పాలసీ టర్మ్ పెట్టుకుంటే 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఇక ఇలాంటి సమయంలో ప్రతి ఏడాది 40,000 వరకు ప్రతి ఏడాది డబ్బులు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు వందేళ్ల తర్వాత కూడా జీవించి ఉంటే మీకు బోనస్ తో పాటు భీమా మొత్తం కలిపి 39 లక్షలు పొందుతారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి