ఇక భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో కొత్తగా 42వేల 909 కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ నుంచే 29వేల 386 కేసులున్నాయి. మరో 380మంది కరోనా కాటుకు బలికాగా మొత్తం మృతుల సంఖ్య 4లక్షల 38వేల 210కు చేరింది. నిన్న 34వేల 763మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 3కోట్ల 19లక్షల 23వేల 405కు పెరిగింది. అయితే రికవరీల సంఖ్య కంటే కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం 3లక్షల 76వేల 324యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 41వేల 173మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 878మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 13వేల 001కు చేరింది. తాజాగా 1,182మంది కోలుకోవడంతో.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 19లక్షల 84వేల 301కు చేరింది. కరోనా వైరస్ బారిన పడి మరో 13మంది చనిపోయినట్టు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 14వేల 862యాక్టివ్ కేసులున్నట్టు పేర్కొంది.
ఇక తెలంగాణలో గడిచిన 24గంటల్లో 75వేల 102మందికి పరీక్షలు చేయగా.. 340మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా కోవిడ్ మహమ్మారి వల్ల ఇద్దరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3వేల 72కు చేరుకుంది. అటు మొత్తం కరోనా కేసుల సంఖ్య 6లక్షల 57వేల 716గా ఉంది. వైరస్ బారి నుంచి మరో 359మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం 5వేల 891యాక్టివ్ కేసులున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి