
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ కాదు. అందుకని మీరంతా పొరుగు పెద్దలపై బురద జల్లడం మాను కోం డి. ఇప్పటిదాకా కొనుగోలు ఒప్పందాలు అన్నీ జగన్ కు మేలు చేసేవే తప్ప తెలంగాణకు మేలు చేసేవో లేదా తెలంగాణ చెబితే కొనుగోలు చేసినవో కావు. ఆ మాటకు వస్తే సింగరేణి బొగ్గు గనులకు జగన్ సర్కారు చెల్లించాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. అందుకే సంబంధిత వర్గాలు బొగ్గు సరఫరా నిలిపివేశాయి అని స్పష్టంగా తెలుస్తోంది. బొగ్గు తవ్వకాలపై కూడా ఇప్పటికీ స్పష్టమై న సమాచారమే వస్తోంది. కానీ ఏపీ అధికారులు మొదట్నుంచి ఉత్పత్తిపై కాకుండా కొనుగోలు పై ఎక్కువ ప్రేమ కనబరిచారు. అం దుకు జగన్ చేసిన ప్రయత్నాలూ కారణం అయ్యాయి. దీంతో తలకుమించిన భారంగా కొనగోలు వ్యవహారం మారింది.
థర్మల్ విద్యుత్ కేంద్రాలను గాడిలో పెట్టకపోవడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన విద్యుత్ అంతగా రావడం లేదు. దీంతో సంబంధిత సంస్థలు ఇవ్వాల్సిన దాని కన్నా తక్కువ విద్యుత్ నే రాష్ట్రానికి ఇస్తున్నాయి. అదానీ గ్రూపులతో ఉన్న ఒప్పం దాల కారణంగా త్వరలో మనకు ఒడిశా నుంచి బొగ్గు వస్తుంది కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం అమాంతం పెరిగిపోతాయి. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక సంక్షోభానికి కారణం జగన్ మరియు మోడీ అనే తెలుస్తోంది. వీరిద్దరి వల్లే ఇన్ని సమస్యలు అని కూడా చెబుతున్నారు ఇంకొందరు.