హుజురాబాద్ నియోజక వర్గ  ఫలితాల పై పార్టీ లో ఆత్మ పరిశీలన చేసుకుంటామనీ స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మరియు ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్.   ఈటల రాజేందర్ విర్ర విగుతూ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కొప్పుల ఈశ్వర్. తెలంగాణ  రాష్ట్రం అంతట పర్యటిస్తా అని ఈటల రాజేందర్  అంటున్నారని మండిపడ్డారు కొప్పుల ఈశ్వర్.. ఎవరు అడ్డువున్నారు ?   బీజేపీ పార్టీ లో ఈటల రాజేందర్  కొనసాగడం పై అనుమానాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు.   హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ లు నిసిగ్గుగా కలసి పని చేసాయని నిప్పులు చెరిగారు కొప్పుల ఈశ్వర్.   ఒక ఉప ఎన్నిక ఫలితంను రెఫరెండంగా భావిస్తమా ? భావించమన్నారు కొప్పుల ఈశ్వర్. 

దళిత బంధును ఆపించింది బిజెపి పార్టీ అని నిప్పులు చెరిగారు కొప్పుల ఈశ్వర్.   ఏ అర్హతతో దళిత బంధు ను వెంటనే ప్రారంభించాలని  బండి సంజయ్ అడుగుతున్నారు ? నిప్పులు చెరిగారు కొప్పుల ఈశ్వర్.   ముందు తెలంగాణ రాష్ట్రంకు ఏమి చేస్తారో బిజెపి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు కొప్పుల ఈశ్వర్.  ఎక్కడ లేని విధంగా  హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం బిజెపి పార్టీ మ్యాని ఫెస్టో విడుదల చేసిందని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు కొప్పుల ఈశ్వర్.   దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క లోక సభ 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే బిజెపి పార్టీ  గెలిచిందని ఎద్దేవా చేశారు కొప్పుల ఈశ్వర్.

ఎవరెన్ని చెప్పినా హుజూరాబాద్ నియోజకవర్గం లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓట్ల పరంగా మాత్రమే గెలిచారని... నైతిక విజయం మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీదేనని స్పష్టం చేశారు కొప్పుల ఈశ్వర్. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని... వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కొప్పుల ఈశ్వర్. త్వరలోనే ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు కొప్పుల ఈశ్వర్.

మరింత సమాచారం తెలుసుకోండి: