రానున్న రోజుల్లో వరుసగా యుద్ధాలు జరగబోతున్నాయి. ఇక ఇలా జరిగే యుద్ధాలు ఎంతో భారీ ప్రాణ నష్టాన్ని కలిగించబోతున్నాయా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే మాత్రం అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతుందో అన్న విధంగా మారిపోయింది పరిస్థితి.  చిన్న దేశమైన ఉక్రెయిన్ కు అటు నాటో దళాలు యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికా కూడా ప్రత్యక్ష మద్దతు ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే నాటో దళాలు యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించిన దళాలు కూడా అటు ఉక్రెయిన్ లో మోహరించడం సంచలనంగా మారిపోయింది.


 ఈ క్రమంలోనే అటు రష్యా కూడా సరిహద్దులో లక్షల సంఖ్యలో సైనికులను మోహరించింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే విధంగానే మారిపోయింది పరిస్థితి. ఇది మాత్రమే కాకుండా మరో రెండు యుద్ధాలు కూడా జరగబోతున్నాయి అని తెలుస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా దుబాయ్ లాంటి అరబ్ కంట్రీస్ కూటమి హౌతి తీవ్రవాదుల మధ్య యుద్ధం తలెత్తే విధంగానే మారిపోయింది పరిస్థితి. ఇటీవల తీవ్రవాదులు డ్రోన్లతో దాడి చేస్తే ఇక అటు యుద్ధ విమానాలతో దాడి చేశాయి అరబ్ దేశాలు. ఇటీవలే తీవ్రవాదులు మిస్సైల్స్  తో దాడి చేస్తే మరోసారి యుద్ధ విమానాలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నాయి అరబ్ కంట్రీస్. రానున్న రోజుల్లో ఇది పతాక స్థాయికి చేరి యుద్ధం తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



 మూడో వైపున చైనా తైవాన్ విషయంలో ఎంతో మొండిపట్టు తో ముందుకు సాగుతోంది. తైవాన్  సరిహద్దుల్లో భారీగా యుద్ధవిమానాల మోహరించింది. ఆయా యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలో కి తరచూ పంపిస్తూ ఉండడం గమనార్హం.  ఇలా ప్రపంచ దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం పై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఇక తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి చైనా వ్యూహాలను సిద్ధం చేసింది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తైవాన్ ను కాపాడటం కోసం అమెరికా జపాన్ బ్రిటన్ దేశాలకు చెందిన దళాలు కూడా మోహరించడం గమనార్హం. ఇలా ఒకే సమయంలో ఏకంగా 3 యుద్ధాలు జరగబోతున్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: