సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ స్థాయి నుండి గల్లీ స్థాయి రాజకీయ నాయకులు, పార్టీలు తమ అభ్యర్థుల గెలుపునకు సామా దాన భేదా దండోపాయలు ఉపయోగించి ఎన్నికల్లో పోరాడటం అనేది సహజ ప్రక్రియ లో భాగం.ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ గెలుపే లక్ష్యం గా ఈసీ నియమాలను ఉల్లంఘన చేస్తూ వస్తున్నారు మన నాయకులు. 

 

తెలుగు నాట మీడియా వ్యాప్తి విస్తృతంగా పెరిగిన తర్వాత ప్రతి పార్టీ తమ అభ్యర్థుల తమ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రింట్ , డిజిటల్ మీడియా లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇలా మీడియా లో ప్రకటనలు చేసేందుకు రాజకీయ నాయకులు భారీగా ఖర్చు చేసినట్లుగా ప్రముఖ ఎన్నికల స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్  ప్రతి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రక్రియ అనంతరం తమ నివేదికల్లో ప్రకటిస్తూ వస్తుంది. 



ఎన్నికల సమయంలో తమ పార్టీకి సంబంధించిన వార్తలు లేదా వీడియోలను ప్రచారం చేసేందుకు గాను కొందరు ముందుగా మీడియాలకు భారీగా చెల్లింపులు చేస్తారు , మరి కొందరు ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం చెల్లింపులు చేస్తారు. అలాగే, ఆ పార్టీ కూడా ఎన్నికల్లో ప్రచారం చేయించుకొని ఒక ప్రముఖ తెలుగు ఛానెల్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఎగవేసింది. ఇంతకీ ఆ ఛానెల్ పేరేంటో తెలుసా తెలుసుకోవాలంటే కింద చదవండి.  .




ఒకప్పుడు దేశ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి ఆ తర్వాత క్షిణ దశలో కి ప్రయాణించి తిరిగి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీగా కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ 2009, 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని పార్టీలలాగే అనేక డీజిల్ మీడియాలలో ఎన్నికల ప్రచారం చేయించుకొని అన్ని ఛానెల్స్ కు చెల్లింపులు చేసిన  హెచ్ .ఎం. టివి కి మాత్రం చెల్లించలేదు .ఇంతకి రెండు ఎన్నికల ప్రచారాలకు నిమిత్తం హెచ్ . ఎం టీవి కి  ఎంత బాకీ పడిందో తెలుసా సుమారు కోటి రూపాయలు. 


ఈ విషయాన్ని స్వయంగా ఆ టీవీ వ్యవస్థాపక సంపాదకులు కె.రామచంద్ర మూర్తి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నికల ముగిసిన అనంతరం రావాల్సిన డబ్బులు వసూలు చేసేందుకు స్వయంగా రామచంద్ర మూర్తి గారే  ఆ పార్టీ సీనియర్ నాయకుల వద్ద ప్రస్తావించగా అప్పటి తెలుగుదేశం పార్టీ వాణిజ్య వ్యవహారాల భాద్యుడుగా ఉన్న (ప్రస్తుతం బిజెపి నేత) సుజనా చౌదరి వద్ద తీసుకోవాలని సూచించారు. సుజనా చౌదరి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా రేపు మాపు అంటూ కాలపాయన చేశారు అని ఇంటర్వ్యూలో రామచంద్ర మూర్తి గారు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: