ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక  మిలిటరీ ఆదేశాలు ఇవ్వడంతో రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దు దాటాయి. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు నాటో బలగాలు రష్యా ప్రత్యక్ష యుద్ధానికి దిగలేదు. అమెరికా బ్రిటన్ ఎంత అసంతృప్తితో ఉన్నప్పటికీ రష్యా మాత్రం ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే దిశగా తన బలగాలను పెంచుకుంటూ పోతోంది. అమెరికా రష్యాలు పరస్పరం కాల్పులకు దిగితే అది ప్రపంచ యుద్ధ మేనని జనవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. కానీ ఉక్రెయిన్ కు ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికా బలగాలను పంపబోమని స్పష్టం చేశారు. మరి ప్రస్తుత ఉద్రిక్తతలు మరింత తీవ్ర యుద్ధానికి దారితీస్తాయా..? రష్యా తన దాడులను ఇంకా ముమ్మరం చేస్తుందా..? ఇది ఉక్రెయిన్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?

 ఉక్రెయిన్ రాజధాని రష్యా క్షిపణి దాడులకు దిగింది. ఫిబ్రవరి 24 ఉదయం ఐదారు పేలుళ్ళు వినిపించాయి. అయితే రష్యా నాటో దేశాలను భయపెడితే మాత్రం ప్రమాదం తప్పకపోవచ్చు. నాటో లోని ఐదవ ఆర్టికల్ ప్రకారం నాటో సభ్యదేశాల్లో ఏ దేశం పై దాడి జరిగిన మొత్తం అన్ని దేశాలు కలిసి దాన్ని ఎదుర్కోవాలి. ఉక్రెయిన్ ప్రస్తుతం నాటో సభ్య దేశం కాదు. కానీ తాము నాటో లో చేరాలనుకుంటున్నామని ఉక్రెయిన్ చెప్పింది. దీన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన ఎస్తోనియా, లాత్వియా, లిథువవేనియా, పొలాండ్ ఇప్పుడు నాటోలో సభ్యులుగా ఉన్నాయి. అయితే రష్యా ఆక్రమణ ఉక్రెయిన్ తో ఆగపోవచ్చునని ఈ దేశాలు కూడా ఆందోళనగా ఉన్నాయి. అందుకే ఇటీవల నాటో తమ బలగాలను ఈ ప్రాంతాలకు పంపించింది.నాటో దళాలు, రష్యా బలగాలు నేరుగా తలపడినంత కాలం ఉక్రెయిన్ లో పరిస్థితి ఎంతగా దిగజారిన అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేవు. కానీ అమెరికా, రష్యాల దగ్గర 8 వేలకు పైగా అణ్వయిదాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆందోళన పెరుగుతోంది.నాటో తో యుద్ధానికి పుతిన్ సిద్ధంగా లేరు.

 ఆయన లక్ష్యం ఉక్రెయిన్ ను కూడా బెలారుస్ లాగా ఓ సామంత దేశంగా మార్చుకోవడమేనని ఓ సీనియర్ బ్రిటిష్ మిలిటరీ అధికారి తెలిపారు. పుతిన్ మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదని ఆయన అన్నారు. ఫిబ్రవరి 21న ఆయన ప్రసంగం చూస్తే ఓ వ్యూహకర్త కన్నా కూడా ఆగ్రహంతో స్పందించే  నియంతలా కనిపించారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా  పశ్చిమ దేశాలు,రష్యా మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. అందుకే ప్రస్తుత ఉక్రెయిన్ సంక్షోభానికి బాధ్యులు ఎవరూ అనేది చెప్పడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: