ఇటీవల దేశంలో ముగిసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ కాంగ్రెస్ పార్టీ కి అయిదు రాష్ట్రాల ప్రజలు గట్టి షాక్ ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా లలో డిపాజిట్లు దక్కకపోగా, అధికారంలో ఉన్న పంజాబ్ లోనూ దారుణంగా సీఎం అభ్యర్థి, పిసిసి అధ్యక్షుడు కూడా ఎన్నికల్లో ఓడిపోవడం చూస్తుంటే ఇంతలా కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఇక ఈ అయిదు రాష్ట్రాలలో మరియు దేశ వ్యాప్తంగా పుంజుకోవడానికి ఏ విధమైన చర్యలు, ప్రణాళికలు తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.

కాగా పంజాబ్ లో హేమా హేమీలను ఎదుర్కొని స్థానిక పార్టీగా పేరున్న అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానంలో గెలుపొంది అధికారాన్ని ఏర్పరిచింది. పంజాబ్ లో మొత్తం ఉన్నది 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 79 శాతం సీట్ లను ఆప్ సాధించి బీజేపీ మరియు కాంగ్రెస్ లకు గట్టి షాక్ ఇచ్చింది. ఇక ఇంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 18 సీట్ లను మాత్రమే సాధించి ప్రజల్లో బాగా బలహీనం అయిపోయింది. గత ఎన్నికలలో వచ్చిన సీట్ లు కన్నా 59 సీట్ లు కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ అభ్యర్థి భగవంత్ మాన్ సీఎం గా ఉన్నారు.

మంచి ఉద్దేశ్యాలు పంజాబ్ లో పాలన సాగించడానికి గట్టిగా ప్రణాళికలు చేస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే తెలంగాణ ఆప్ ఇంచార్జ్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆప్ ని తెలుగు ప్రజల ఆదరిస్తారా లేదా అన్నది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: