మానవాళి నీ ఎంతగానో ఇబ్బంది పెట్టిన కరోనా ప్రపంచ దేశాలను వణికించింది. ఈ మహమ్మారి కారణంగా ఎన్నో వేలమంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఎందరో తల్లితండ్రులు తమ బిడ్డలను కోల్పోయారు ...ఈ కరోనా కరణమగ్ ఎందరో బిడ్డలు తమ తల్లితండ్రులను కోల్పోయి రోడ్డున పడ్డారు. మరికొందరు తమ ఆప్తులను కోల్పోయారు.

ఈ వైరస్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.కాగ ఈ సహాయంపై  సుప్రీంకోర్టు కొత్త గా కీలక ఆదేశాలను జారీచేసింది. పరిహారాన్ని అందుకునేందుకు గాను దరఖాస్తు ను పెట్టేందుకు నిర్ణీత గడువు విధించింది కీలక నిర్ణయాన్ని తీసుకుంది.  

ఈ మేరకు స్పందిస్తూ మార్చి 20వ తేదీకి ముందు వరకు కూడా ఎవరైతే కొవిడ్‌ కారణంగా మరణించి ఉంటారో వారికి సంబంధించిన వారి వారు ఈ ఆర్థిక సహాయం కొరకు 60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. కాగ ఇంకా కరోనా ముప్పు పొంచి ఉన్నందున ఒకవేళ భవిష్యత్తులోను ఈ మహమ్మారి కారణంగా మరణాలు సంభవిస్తే కనుక   బాధిత కుటుంబాలు ఈ పరిహారం కొరకు దరఖాస్తు చేయొచ్చని అయితే అందుకు 90 రోజుల లోపు మాత్రమే గడువు అని స్పష్టం చేసింది. నింతయించిన రోజుల వరకు దరఖాస్తు అనుమతికి గడువు ఇవ్వాల్సిందిగా భారత  న్యాయస్థానం పేర్కొంది.


కొవిడ్‌ పరిహారం కోసం బాధిత కుటుంబాలు ధరకాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఇవ్వడం సరికాదని గతం లో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ వారిని కోల్పోయిన బాదనుంది వెంటనే బయటపడి అందరూ ఇలా ఆర్ధిక సహాయం కోసం దరఖాస్తు చేయడం కోసం చూడరని వారికి ఆ బాధ నుంచి బయటకు రావడానికి కనీస గాడు అవసరమని అభిప్రాయపడింది. అయితే ఆ ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది భారత అత్యున్నత న్యాయస్థానం.

మరింత సమాచారం తెలుసుకోండి: