
ఇది కాకుండా అమిత్ షా కేసీఆర్ ను ఉద్దేశించి... "రైతు వ్యతిరేకి" అన్నారు. ఇక ఈ మాటపై తెలంగాణ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అమిత్ షా కు కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా కేసీఆర్ ను రైతు వ్యతిరేక అనడం ఈ శతాబ్దపు జోక్ అని అభివర్ణించారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్క రైతు ఎంతో సంతోషంగా ఉంటే అమిత్ షా ఇలా అనడం ఏమిటంటూ ఆయనపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ రైతుల అభివృద్ధి కోసం ఎంతో అలోచించి తీసుకు వచ్చిన రైతు బంధు లాంటి పధకాన్ని తీసుకువచ్చారు. ఇదే పధకాన్ని కొంచెం అటూ ఇటుగా మార్చి పీఎం కిషన్ గా తీసుకు వచ్చింది మీ ప్రభుత్వం కాదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
ఇక రైతుల గురించి అంతగా ఆలోచించే మీ ప్రభుత్వం... రైతులకు పూర్తి వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు చట్టాల వలన దేశ వ్యాప్తంగా 700 మంది రైతుల ప్రాణాలను బాలి తీసుకుంది మీ ప్రభుత్వం కాదా అంటూ అడిగారు. సభలో అమిత్ షా కేసీఆర్ పై చేసిన ఆ వ్యాఖ్యకు కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ ప్రవేశ పెట్టిన పధకాన్ని ప్రధాని మోదీ కాపీ కొట్టారా అన్న ఆలోచన మెదులుతోంది. మరి ఇందులో నిజ నిజా లేమిటన్నది తెలియాల్సి ఉంది.