ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వచ్చిందంటే ఉండే సందడి అంతా ఇంతా కాదు అని చెప్పాలి. దేశంలో ఎక్కడా లేనంతగా కేవలం హైదరాబాద్ నగరంలోనే ఎంతో వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుగుతాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. వినాయక చవితి వస్తే తమకు ఇష్టానుసారంగా ఇక వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న కొబ్బరి చిప్పలతో వినాయకుడిని ఏర్పాటు చేయగా అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు వినాయకుడు ఏకంగా క్రికెటర్ అవతారమెత్తాడు.
సాధారణంగానే భిన్నమైన రూపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్లోని బేగం బజార్ లో ఎన్నో రకాల గణేష్ విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది బాల్ యువ మండల్ బేగంబజార్ హిందీ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయకుడు మాత్రం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయాడు. ఎందుకంటే బాక్స్ క్రికెట్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణేషుడిని క్రికెటర్ అవతారంలో ఏర్పాటుచేసి పిచ్ పై క్రికెట్ బ్యాట్ పట్టుకుని నిలబడి ఉన్న వినాయకుడికి గణనాధుని వాహనం అయిన ఎలుక బౌలింగ్ వేస్తున్నట్లుగా ఈ విగ్రహం ఉంది. ఈ విగ్రహం కాస్త అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి