స్కిల్ స్కామ్ లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుతో పాటు యావత్ తెలుగుదేశంపార్టీకి దగ్గుబాటి సురేష్ బాబు పెద్ద షాకిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మాట్లాడమని, మద్దతివ్వమని టీడీపీతో పాటు ఎల్లోమీడియా పదేపదే సినీ ప్రముఖలను బతిమాడుకుంటోంది. కొందరినైతే పదేపదే రెచ్చగొడుతోంది. చంద్రబాబు అరెస్టును ఖండించింది ఇప్పటివరకు ముగ్గురు ప్రముఖులు మాత్రమే. అశ్వనీదత్, నట్టికుమార్, రాఘవేంద్రరావు. వీళ్ళల్లో అశ్వనీదత్, రాఘవేంద్రరావు టీడీపీ అధినేత  చంద్రబాబు వల్ల చాలా లాభపడ్డారు.

అందుకనే చంద్రబాబు అరెస్టవ్వగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టారు. నట్టికుమార్ తాను చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడటమే కాకుండా మాట్లాడని వాళ్ళ గురించి చాలా చులకనగా మాట్లాడారు.  మరి నట్టికుమార్ కు చంద్రబాబుతో ఉన్న అనుబంధం ఏమిటో తెలుదు అలాగే జగన్ తో ఉన్న వైరం ఏమిటో క్లారిటిలేదు. ఏదేమైనా ఆయన చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడటం వరకు ఆయన ఇష్టమనే అనుకోవాలి. కాకపోతే మాట్లాడని వాళ్ళని గురించి తప్పుపట్టడమే చాలామందికి నచ్చలేదు.

ఈ నేపధ్యంలోనే నిర్మాత దుగ్గుబాటి సురేష్ స్పందించారు. రాజకీయాల్లో సినిమా వాళ్ళు జోక్యం చేసుకోకుండా ఉండటమే అందరికీ మంచిదన్నారు. రాజకీయాలకు సినిమా వాళ్ళు ఎంతదూరంగా ఉంటే అంత బాగుంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టన్నది చాలా సున్నితమైన అంశంగా సురేష్ తేల్చేశారు. దీనిపై సినిమా ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరమే లేదన్నారు. తాము రాజకీయనేతలం కాదు, రాజకీయల్లో కూడా లేమన్నారు.

అలాగే మీడియాతో కూడా తమకేమీ సంబంధంలేదన్నారు. రాజకీయాలతో కానీ మీడియాతో కాని సంబంధంలేనపుడు సున్నితమైన అంశంపై స్పందించటం ఎందుకని తన మనసులోని మాటను చెప్పారు. తెలుగుదేశంపార్టీకి సంబంధించిన వ్యక్తులు కొందరు స్పందించటం కూడా సరికాదని సురేష్ అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండకూడదన్నదే తన అభిప్రాయంగా సురేష్ చెప్పారు. మరి సురేష్ అభిప్రాయంతో ఎంతమంది ఆమోదిస్తారో తెలీదు. అయితే చాలామంది ప్రముఖులు చంద్రబాబు అరెస్టుపై నోరెత్తలేదు. దాంతో ఎల్లోమీడియా, టీడీపీ నేతలు మండిపోతున్నారు. అయితే ఏమీచేయలేక మౌనంగా ఉన్నారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: