అయిదు రాష్ట్రాల ఎన్నికలు చివరి దశకు వచ్చేశాయి. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పెద్ద రాష్ట్రాలు. ఇందులో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని, రాజస్థాన్ లో బీజేపీ జయ కేతనం ఎగుర వేస్తుందని, తెలంగాణలో కాంగ్రెస్ కూడా మంచి సీట్లు సాధించిన విజయం వరకు వచ్చే అవకాశం లేదని బెట్టింగ్ రాయుళ్లు పందేళు కాస్తున్నారు.


ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపైనే ఎక్కువగా బెట్టింగ్ కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా బెట్టింగ్ ఊపందుకుంది. ఎన్నికలు చివరి దశకు రావడం కేవలం తెలంగాణలోనే నవంబర్ 30 న ఎన్నికలు జరుగుతుండటం, దీంతో పాటు డిసెంబర్ 3 న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉండటం తో బెట్టింగ్ రాయుళ్లు తీరిక లేకుండా గడుపుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లీడ్ లో ఉంటుందని, బీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని చాలా మంది ఊహించుకుంటున్నారు.


బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి అధికారంలోకి వస్తాయని అంచనా వేసుకుంటున్నారు. ఛత్తీస్ గడ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు. అదే సమయంలో రాజస్థాన్ లో మాత్రం మార్పు తథ్యమని భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు మాత్రం తప్పదని బెట్టింగ్ వేసుకుంటున్నారు. దీనిపై కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది.


ఛత్తీస్ గడ్ లో కాస్త బీజేపీ కి సీట్లు పెరిగినా.. అధికారం మాత్రం కాంగ్రెస్ దేనని బెట్టింగ్ రాయుళ్లు పందెలు కాస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా వచ్చే డిసెంబర్ 3 న ఎవరు గెలుస్తారు.. ఎవరూ ఓడిపోతారు.. ఎక్కడా బీజేపీ అధికారంలోకి వస్తుంది ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగనుంది. ఈ ఎన్నికలు రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయనేది రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: