తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీకి పరాభవం ఎదురయింది. ఊహించని రీతిలో తెలంగాణలో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ దాటి 64 స్థానాలను సొంతం చేసుకుంది. ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పాలి. ఇక తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే ఈ ఎన్నికల్లో కేవలం న 39 స్థానాలకు మాత్రమే పరిమితమైన బిఆర్ఎస్ పార్టీ ఇక ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో బిజెపి కూడా మునుపెన్నడు  లేని విధంగా 8 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. కాగా ఇలా ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెరమిదికి వస్తు వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులు.. ఒకే ఊరుకు చెందిన వారై.. ఒకే రకం ఫలితం పొందారు అన్న విషయం కూడా ఇలాగే హాట్ టాపిక్ గా మారింది.


ఆ వివరాలు చూసుకుంటే.. ఖమ్మం జిల్లాలో ఒకే ఊరికి చెందినఇద్దరు వ్యక్తులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడ్డారు. కానీ ఆ ఇద్దరు కూడా ఓటమి చవి చూడటం గమనార్హం. అదే సమయంలో ఒకే ఊరికి చెందిన మరో ఇద్దరు అభ్యర్థులు మాత్రం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ డంకా మోగించారు. దమ్మపేట మండలం గుండు గులపల్లి గ్రామానికి చెందిన జారే ఆదినారాయణ, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. కూసుపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన గండ్ర వీర వెంకటయ్య, కందాల ఉపేందర్రెడ్డి లు బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: