ప్రస్తుతం వైసీపీ పార్టీలో పరిస్థితి చాలా కూల్ గా ఉన్నది.. వైసిపి అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం రోజున పులివెందులలో వైయస్ షూట్ వద్ద అభ్యర్థులను సైతం ప్రకటించారు.. ముఖ్యంగా బీసీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యే జాబితాలను విడుదల చేయగా ఎంపీ ఎస్సీ నేత నందిగాం సురేష్ 24 మంది ఎంపీల జాబితాలను కూడా ప్రకటించడం జరిగింది.. అయితే గతంలో చెప్పిన దానికి తాజాగా జాబితాలలో కేవలం కొన్ని మార్పులను మాత్రమే చేసినట్టుగా కనిపిస్తోంది.. గతంలో 13 జాబితాలను విడుదల చేయగా ఇందులో సమన్వయకర్తలను సైతం నియమించడం జరిగింది.


నిజానికి వేరే అభ్యర్థులను అందరూ అనుకున్నారు కానీ వాస్తవానికి అదే నిజమైంది. కేవలం చిన్న చిన్న మార్పులే చేశారు.. అయితే కడుప నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఒకరిని నియమిస్తే జాబితాలో మరొకరు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇలా కొన్ని స్థానాలలో కేవలం మార్పులు అయితే కనిపించాయి.. కానీ ఇలా మార్పులు జరిగినప్పుడు కూడా అభ్యర్థులు ప్రకటన వెలువడినప్పుడు ఎక్కడ అసంతృప్తి మాత్రం బయటికి రాలేదు.


అయితే తాజాగా వైసీపీలో ఎలాంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు.. దీంతో వైసిపి పార్టీ తమ నిర్ణయాలను ఎవరు వ్యతిరేకించడం లేదని వైసీపీ నేత సీఎం భావించి ఉండవచ్చని క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ అంశాలన్నీ పరిగణముతోకి తీసుకొని సైలెంట్ గా ఉంచుతూ ఎలక్షన్ సమయంలో ఈ అసంతృప్తులు సైలెంట్గా తమ పని చేసుకుంటూ పోతే వైసీపీ పార్టీకి దెబ్బ పడుతుందని వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ సైలెంట్ వెనుక మరొక రీసన్ ఉన్నదని సీఎం జగన్ భవిష్యత్తును ముందుగానే కాస్త ఆలోచించి తమ పార్టీ నాయకులను ఇతర అభ్యర్థులను పిలిచి నచ్చ చెప్పారని ఎలాంటి వివాదాలకు, ఆగ్రహానికి, కన్నీళ్ళకు వంటివి లేకుండా సాఫీగా అభ్యర్థులను ప్రకటించాలని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే అభ్యర్థులు కూడా ఎవరు ఏమి మాట్లాడలేదని సమాచారం. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు సీఎం జగన్ కు మధ్య తేడా ఎంత క్లారిటీగా ఉందో కనిపిస్తోంది.. ఇటీవల టిడిపి అభ్యర్థులకు సీట్లు రాకపోవడంతో చాలామంది నానా హంగామా చేశారు..కానీ వారందరిని పిలిచి చంద్రబాబు ఎప్పుడు మాట్లాడలేదు.. అటు జనసేన పరిస్థితి కూడా ఇలానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: