జగన్: తోడేళ్లన్నీ ఏకమయ్యాయి..అయినా నో ఫియర్..!ఆంధ్రాలో పొత్తులో భాగంగా టిడిపి జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఈసారి ఎన్నికలలో నిలబడబోతున్నాయి. అయితే ఈ పోత్తుల పైన సీఎం జగన్ ఇటీవలే తాను మొదలుపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రల సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ హెరాల్డ్ కు అందిస్తోన్న కథనం మేరకు తాను ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నానని తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ కూడా ఒక్కటవుతున్నాయి అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ పొత్తు కు కాంగ్రెస్కు కూడా సపోర్టు చేస్తోంది అంటూ ఎద్దేవ చేశారు ఏపీ సీఎం జగన్... కుట్రలు క్రృతంతాలు ఎదుర్కొనేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు.


ఇండియన్ హెరాల్డ్ కు వచ్చిన సోర్స్ మేరకు..ఈ సారి వైయస్సార్ పార్టీ డబుల్ సెంచరీ కొట్టేలా ప్రజలు సిద్ధంగా ఉండాలని మోసపూరితమైన హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేసేటువంటి చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలంటూ కూడా సూచించారు.. మూడు రాజధానులతో పాటు కొత్తగా రాష్ట్రంలో మరో 13 జిల్లాలు ఏర్పాటు చేస్తానంటూ కూడా తెలియజేశారు జగన్.. చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నపటికీ తాను ఏనాడు కూడా అభివృద్ధి పనులు చేయలేదని.. చంద్రబాబు పేరు చెబితే వ్యవసాయం దండగనే వ్యాఖ్యలు గుర్తుకు వస్తాయని తెలిపారు సీఎం  జగన్..తాము 2019లో ఇచ్చిన ఎన్నికల హామీలను తాను 99 శాతం అమలు చేశానంటూ సీఎం జగన్ వెల్లడించారు.


చంద్రబాబు ఒక జిత్తుల మారిన నక్క పొత్తుల మారిన నక్క అంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.. చంద్రబాబుకు ఓటు వేస్తే కచ్చితంగా మరో పదేళ్లు వెనక్కి వెళ్ళిపోతామంటూ ఓటు వేసే ముందు కచ్చితంగా అందరూ ఆలోచించే ఓటు వేయండి అంటూ సూచించారు. చంద్రబాబు అబద్దాల మోసాలను తెలుసుకొని నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సైతం సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. వైసీపీకి ఓటు వేస్తే మరో ఐదేళ్లు ముందుకు వెళ్తామంటూ గ్రామాలలో సచివాలయాలు, స్కూల్లో అభివృద్ధి, ఆర్బీకేలు అన్నీ కూడా చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదంటూ కూడా ప్రశ్నించారు. ఐదేళ్లలోనే గ్రామలు ఇంత అభివృద్ధి జరిగాయని గమనించాలి అంటూ సూచించారు. వివక్ష లేని రాజకీయ పాలన చేశామంటూ సీఎం జగన్ తెలియజేశారు. ఎంతమంది ఏకమైనా ఎంతమంది పొత్తులు పెట్టుకొని వచ్చిన తను మాత్రం భయపడేది లేదంటూ తన వెనుక ప్రజలు ఉన్నారని ధైర్యం ఉందంటూ తెలియజేశారు సీఎం జగన్. ఇండియన్ హెరాల్డ్ అందిన సమాచారం మేరకు  ఇప్పటివరకు అన్ని సర్వేలు కూడా వైసిపి పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: