ఏపీలో జనసేన పార్టీ గత 10 సంవత్సరాలలో సాధించింది ఏంటి అనే ప్రశ్నకు ఏమీ లేదనే విధానం వినిపిస్తుంది. జనసేన పార్టీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సిద్ధాంతాలతో మొదలుపెట్టారో తెలీదు కానీ ఆయన లక్ష్యాలు మాత్రం నెరవేరలేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ పదేళ్లలో ప్రజల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుతుందని చాలామంది భావించారు.
 
అయితే జనసేన ఆ విషయంలో కూడా ఫెయిల్ అయిందనే సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన చాలా సందర్భాల్లో పొత్తు పెట్టుకోవడంతో రెండు పార్టీల అవసరం ఏముందని పవన్ టీడీపీలో చేరి రాజకీయాలు చేస్తే సరిపోతుంది కదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన కంటే ప్రజారాజ్యం ఎన్నో రెట్లు బెటర్ అని సామాన్య ప్రజలలో భావన ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేసి 18 స్థానాలలో విజయం సాధించింది.
 
2009 ఎన్నికల్లోనే చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిరంజీవి పార్టీని కొనసాగించి ఉంటే ఈ పాటికి చిరంజీవి సీఎం అయ్యేవారని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం పాలిటిక్స్ కు దూరంగా ఉన్నా జనసేన పార్టీ కోసం ఆయన 5 కోట్ల రూపాయలు డొనేట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. జనసేనకు చిరంజీవి చేసిన సాయం వల్ల ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.
 
జనసేన పార్టీకి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయని తెలుస్తోంది. మెగాస్టార్ చేసిన సాయం వల్ల తాత్కాలికంగా జనసేన ఇబ్బందులను అధిగమించవచ్చు. జనసేనకు రాబోయే రోజుల్లో మరి కొందరు సినీ ప్రముఖులు సహాయం అందిస్తారేమో చూడాల్సి ఉంది. జనసేన 21 స్థానాల్లో కనీసం సగం స్థానాలలో అయినా విజయం సాధిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. పవన్ కు వ్యతిరేకంగా కొంతమంది కాపు నేతలు పని చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: