టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  వార్2 సినిమాలో నటిస్తున్నా తారక్ ఈ ప్రాజెక్ట్ విషయంలో తారక్ సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.వార్2 మూవీలో తారక్ పాజిటివ్ రోల్ పోషిస్తున్నారా? లేక నెగిటివ్ రోల్ పోషిస్తున్నారా? ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం వార్2 సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. వార్2 సినిమా గురించి స్పందించి ఆ సినిమాపై అంచనాలు పెంచేస్తే దేవర మూవీపై ఆ ప్రభావం పడుతుందని తారక్ భావిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది.వార్2 సినిమా విషయంలో తారక్ సైలెన్స్ వెనుక అసలు లెక్కలివేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వార్2 సినిమా 2025 సంవత్సరం ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దేవర సినిమా సక్సెస్ సాధించిన తర్వాత మాత్రమే అధికారికంగా వార్2 సినిమా అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి దాకా తారక్ వార్2 షూటింగ్ లో పాల్గొన్నా దేవర సినిమా ప్రమోషన్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో దేవర రిలీజ్ కాబోతుంది.


మే నెల 20వ తేదీన విడుదల కానున్న దేవర టీజర్ తో ఈ సినిమా కథకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు  ఉంటాయి. తారక్ వార్2 సినిమాలో నటించడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర మూవీ పై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. వార్2 మూవీతో తారక్ సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర భాషల్లో స్ట్రెయిట్ సినిమాలు నటించడంపై ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశాలు  ఉన్నాయి.వార్2 మూవీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని అందుకే తారక్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వార్2 మూవీలో అదిరిపోయే ట్విస్టులు కూడా ఉంటాయని యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం తారక్సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. మరి చూడాలి ఈ సినిమా తారక్ కి ఎంత వరకు ప్లస్ అవుతుంది. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: