జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు దాటుతోంది. 2014 ఎన్నికలకు కాస్త ముందుగా జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఎన్నికలలో పోటీ చేయలేదు. 2019 ఎన్నికలలో జనసేన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో పోటీ చేసింది. జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే దురదృష్టవశాత్తు తొలి ఎన్నికలలోనే జనసేన ఘోరంగా ఓడిపోయింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాలలో ఓడిపోయారు. భీమవరంలో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన పవన్.. గాజువాకలో అయితే ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.


ఇక ఐదేళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి టీడీపీ, బీజేపీతో జట్టు కట్టి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో ఓడిపోయిన రెండు నియోజకవర్గాలను కాదని.. ఈసారి తాను అసెంబ్లీకి వెళ్లడానికి కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే పవన్ తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు నమోదు చేయించుకోలేదు. ఈరోజు పవన్ తన ఓటును మంగళగిరిలో వేశారు. తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి పవన్ మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ జనసేన పోటీలో లేదు. తెలుగుదేశం, వైసీపీ పోటీ చేస్తున్నాయి.


దీంతో పొత్తుధర్మం పాటించక తప్పదు కదా. అందువల్ల పవన్ తన ఓటును అక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ కు వేయాల్సి ఉంది. అలాగే ఎంపీ ఓటు గుంటూరు పార్లమెంటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పెమ్మ‌సాని చంద్రశేఖర్ కు పవన్ వేయాల్సి ఉంది. అదే పవన్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నమోదు చేయించుకుని ఉంటే.. అసెంబ్లీతోపాటు కాకినాడ పార్లమెంటుకు జనసేన నుంచి పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు వేసేవాడు. ఆ చిన్న పని చేసి ఉంటే తన రెండు ఓట్లు గాజు గ్లాసు సింబల్ పై వేసుకునేవారు. ఆ పని చేయకపోవడంతో పవన్ తన రెండు ఓట్లు కూడా సైకిల్ సింబల్ పై వేయాల్సి వచ్చింది. దీనిపై జనసేన యాంటీ గ్యాంగ్ ట్రోలింగ్ కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: