రాజకీయ జీవితంలో నాయకుడు ఆడే ప్రతీ మాటకు ఒక విలువ ఉంటుంది. అందుకే వారు ఒకటి మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడవలసి ఉంటుంది. అదే విధంగా వారి చేతలకు కూడా ఒక లెక్క అనేది ఉండాలి. లేదంటే నెక్స్ట్ టైం ఎన్నికల విషయంలో ఈ విలువలూ లెక్కలు తాలూకా పర్యవసానం తలకిందులైపోతుంది. ఎందుకంటే వారిని జనం కోటి కళ్ళలో గమనిస్తూంటారు. అయితే అధికారం అన్నది ఒక మత్తు లాంటిది. ఒక్కసారి ఆ మత్తులో పడినవారికి ఏమీ కనిపించవు. పైగా తాము ఏమి చేసినా కరెక్ట్ అన్న భావన ఉంటుంది. అందుకే వారు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి బెడిసి కొడతాయి. అలా కాకుండా అధికారం ఒక అద్భుత అవకాశం అని ఫీల్ అయ్యేవారు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు.

ఇక అసలు విషయానికొస్తే రెండు తెలుగు రాష్ట్రాల ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్ ఆరు నెలల తేడాలో అత్యంత దారుణంగా ఓటమి పాలు అయ్యారు. దానికి గల కారణాలు అందరికీ తెలిసిందే. ఒకేరకమైన కారణాల వలన వీరు ఇరువురు ఓటమి పాలయ్యారనేది నిర్వివాదాంశం. అవే ఇపుడు జనాలలో చర్చకు దారి తీస్తున్నాయి. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నపుడు కొంతమందిని దూరం చేసుకుని కేసీఆర్ జగన్ పదవీచ్యుతులు అయ్యారు. అదే విధంగా అలాగే కొన్ని అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుని వారు భారీ ఒటమిని చవిచూశారని విశ్లేషకుల వాదన.

ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే మంచి నేత, బీసీ వర్గానికి చెందిన నాయకుడు ఈటెల రాజెందర్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో అతనికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఈటెల పట్ల అందరికీ సానుభూతి ఏర్పడడానికి అది ఒక కారణం అయింది. కట్ చేస్తే ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఈటెల గెలిచి తన సత్తా చాటుకున్నారు. అదే విధంగా ఏపీ విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుని సరిగ్గా ఎన్నికలకు 6 నెలల ముందు అరెస్ట్ చేసి జగన్ చేయరాని తప్పు చేసాడు. ఆ సమయంలో బాబుకి మద్దతుగా తెలంగాణ ప్రజానీకం కూడా తమ గళాన్ని విప్పారు. అయితే దానికి కెసిఆర్ అండ్ కేటీర్ టీమ్ మద్దతు ఇవ్వకపోగా బాబుపై విషాన్ని కక్కారు. అందుకనే అక్కడ ఇక్కడ కూడా ఇద్దరూ నేతలు ఘోరమైన పరాభవాన్ని చవిచూశారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: