అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలలో ఫ్రీ బస్సు ఒక్కటే అమలు చేసి.. కాంగ్రెస్ చేతులు దులుపుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో... గులాబీ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇక ఇప్పుడు.. తెలంగాణ బిజెపి నేతల పైన దృష్టి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు ఈటెల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారట. అయితే ఇప్పుడే పార్టీ మారితే చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని ఈటల రాజేందర్ వెనక్కి తగ్గినట్లు.. ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారట.
బిజెపి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయనతో చర్చలు కూడా జరిపారట. తాజాగా హైడ్రా ను స్వాగతిస్తూ కీలక ప్రకటన చేశారు కొండ విశ్వేశ్వర్ రెడ్డి. కానీ బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్...మాత్రం హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి