
ఆర్డిటీ సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలో విదేశీ విరాళాల ద్వారా వైద్య, క్రీడా సౌకర్యాలను అందిస్తోంది. అయితే, విదేశీ విరాళాలను ఇతర ఎన్జీఓ కార్యకలాపాలకు వినియోగించారన్న ఆరోపణలతో సంస్థ రిజిస్ట్రేషన్‌ను కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో, 532 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రులు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్డిటీ నిర్వహిస్తున్న క్రీడా గ్రామం, క్రికెట్ స్టేడియం వంటి సౌకర్యాలను స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ సముదాయాలు వినియోగిస్తున్నాయని శ్రీనివాసులు గుర్తు చేశారు. సంస్థ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు కేంద్రం కొత్త దరఖాస్తు సమర్పించాలని సూచించిందని తెలిపారు.
ఈ సంక్షోభం నుంచి ఆర్డిటీని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరినట్లు శ్రీనివాసులు వెల్లడించారు. ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు ముఖ్యమంత్రి సాయం చేయాలని విజ్ఞప్తి చేశామని, రాష్ట్రం తరఫున సహకారం అందించాలని కోరామని తెలిపారు. పేద ప్రజలకు ఉదాత్త సేవలు అందిస్తున్న ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. అంతేకాక, ఉన్న నిధులను సద్వినియోగం చేస్తూనే, కొత్త విరాళాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు