ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడిగా పేరు ఉన్న అన్వేష్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతనికి తెలంగాణ పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు తెలుగు యూట్యూబర్లపై పడిపోయిన ప్రపంచ యాత్రకు కూడా అన్వేష్ పైన... తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రపంచ యాత్రకుడు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఏది చేసినా వద్దు అదుపు ఉండాలి. కానీ ఈ ప్రపంచయాత్రికుడు... కాస్త రెచ్చిపోయి ప్రవర్తించడంతో కేసు నమోదు అయింది.

 తెలంగాణ డిజిపి జితేందర్, మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి అలాగే ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి, దాన కిషోర్ అలాగే వికాస్ రాజు  లాంటి ప్రముఖుల పైన.. అనవసరంగా ప్రపంచయాత్రికుడు అన్వేష్ రెచ్చిపోయి ప్రవర్తించాడు. వాళ్లందరిపై అనేక రకాల ఆరోపణలు చేశాడు ప్రపంచ యాత్రకుడు అన్వేష్. సైబరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ లో ప్రచారం పేరుతో ఏకంగా 300 కోట్లు కొట్టేసారని.. ఓ వీడియో కూడా పెట్టాడు అన్వేష్.

 అయితే ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీంతో తాజాగా... ప్రపంచయాత్రికుడు అన్వేష్ పై కేసు నమోదు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ.  అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వెంటనే విచారణకు హాజరు కావాలని... ఆదేశాలు జారీ చేసింది పోలీస్ శాఖ. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసు పై ప్రపంచ యాత్ర కూడా అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. అటు మొన్నటి వరకు తెలుగు యూట్యూబర్ల పైన అనేక ఆరోపణలు చేశాడు అన్వేష్. అయితే ఇప్పుడు అతనిపైనే కేసు నమోదు అయింది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: