పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు "ఆపరేషన్ సిందూర్" ను తీసుకువచ్చింది మోడీ సర్కార్.  అయితే ఈ  "ఆపరేషన్ సిందూర్"... మహిళా శక్తిపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.    ఆపరేషన్ సిందూర్‌కి సంబంధించి తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించిన కేంద్రం...  మహిళా శక్తిపై మెచ్చుకుంది.  ఈ సమావేశంలో అందరి దృష్టిని ఆకర్షించారు భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు.  
 కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది.

1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి...  "ఆపరేషన్ సిందూర్" లో దూసుకెళ్లింది.  అటు 2016 మార్చిలో 'ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18'లో సైన్యబృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా సోఫియా చరిత్ర సృష్టించింది. ఎయిర్‌ఫోర్స్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ హోదా కల్పించింది.  2500 గంటలకుపైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం వ్యోమికా సొంతం కావడం గమనార్హం.    కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో అత్యవసర పరిస్థితులు, వరదల సమయాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు వ్యోమికా సింగ్.


ఇది ఇలా ఉండగా, పాక్ ఉగ్రమూకలు, శిబిరాలపై మరిన్ని దాడులు..? చేసే  ఛాన్స్ ఉందని అంటున్నారు. మరో 12 స్థావరాలను గుర్తించిన భారత త్రివిధ దళాలు...   మరిన్ని దాడులు చేయనుంది.  ఆపరేషన్ సిందూర్-2 ఉంటుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.    మొన్న అర్ధరాత్రి జరిగిన దాడుల్లో 100 మంది టెర్రరిస్టులు హతం అయ్యారు.   ఈ సారి టార్గెట్ ఎవరనేదానిపై  ఉత్కంఠ కొనసాగుతోంది.  



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: