
అయితే ఈ ఊహించని సంఘటనతో అందరూ షాక్ తిన్నారు. ఈ కాల్పుల విరమణ కంటే ముందుగా పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి రుణాలు కావాలంటూ అభ్యర్థించిందట.. పాకిస్తాన్ అభ్యర్థన చేయడంతో ఐఎంఎఫ్ బిలియన్ డాలర్ల ఫండ్ ను రిలీజ్ చేసింది. దీంతో పాకిస్తాన్ కేవలం అప్పుల కోసమే భారత్ తో యుద్ధానికి దిగిందనే విధంగా చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు చూసి అప్పులు పుట్టావని తెలిసి యుద్ధం వల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఐఎంఎఫ్ వంటివి జాలిపడి చైనా లాంటి దేశస్తులు మద్దతు వస్తాయనే విధంగా పాకిస్తాన్ కుట్ర పడిందనే విధంగా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రస్తుతం ఐఎంఎఫ్ పాకిస్తాన్ కి బిలియన్ డాలర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ పాకిస్తాన్ ఎంత అప్పులు చేసిందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. పాకిస్తాన్ చేసిన అప్పులను రెండు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాలట. పాక్ ఆర్థిక వ్యవస్థ అప్పుల ఆధారంగా నడుస్తూ ఉన్నదట. మొత్తం రుణాలు అన్నీ కలిపి ఇప్పటివరకు 130 బిలియన్ డాలర్లు అప్పుల్లో పాకిస్తాన్ కురుకుపోయి ఉన్నదట. 2027 నాటికి ఈ మొత్తాన్ని చెల్లించాలనే ఒప్పందం కూడా తీసుకున్నదట. 30 బిలియన్లు ఈ ఏడాదికి మిగిలిన అప్పును 2027 నాటికి తిరిగి చెల్లించాలని పాకిస్తాన్ పైన చాలా ఒత్తిడి ఉన్నది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా రోజురోజుకీ చాలా దిగజారిపోయింది.
పాకిస్తాన్ భారత్ కేవలం ఒక్కరోజు తేడాతోనే స్వతంత్రం పొందిన నేడు భారత్ ప్రత్యేక ఉనికిని సంపాదించుకోగా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను పోషించి ప్రతిరోజు దీనస్థితికి జారిపోయింది. బంగ్లాదేశ్ కంటే చాలా తక్కువ పరిస్థితులలో పడిపోయిందట పాకిస్తాన్.