
ఆగష్టు నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఫ్రీ బస్ స్కీమ్ అమలు కానుందని తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ స్కీమ్ ను అమలు చేయడం సరైన నిర్ణయం అని నెటిజన్ల నుంచి, ఏపీ ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఈసారైనా ఈ పథకాన్ని అమలు చేస్తారా అని కామెంట్లు చేస్తున్నారు. ఫ్రీ బస్ స్కీమ్ నియమ నిబంధనలు తెలియజేయాలని చెబుతున్నారు.
జిల్లాల వరకు మాత్రమే ఫ్రీ బస్ స్కీమ్ అమలైతే ఈ స్కీమ్ వల్ల మహిళలకు పెద్దగా బెనిఫిట్ కలగదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ అమలు చేస్తే మహిళలు ఈ స్కీమ్ లబ్ధి పొందుతారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ బస్సులకు సైతం ఈ స్కీమ్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. ఫ్రీ బస్ స్కీమ్ అమలు విషయంలో ప్రభుత్వం నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దగా షరతులు లేకుండా ఈ పథకాల అమలు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. సంక్షేమ పథకాల అమలు దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు పాలన విషయంలో మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క పథకం అమలు దిశగా కూటమి సర్కార్ నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ అమలు చేస్తే ఆయనకు తిరుగుండదని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు