గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాజకీయాలలో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. బిఆర్ఎస్ పార్టీలో కవిత కొనసాగుతుందా? లేదా? అనే చర్చలు కూడా జరిగాయి. అయితే తండ్రికి రాసిన లేఖ కొంతమంది కావాలని బయటపెట్టారని కవిత బహిరంగంగానే తెలియజేసింది. తన తండ్రి దేవుడు లాంటివారని కానీ కొంతమంది దెయ్యాలు ఆయన చుట్టూ ఉన్నాయంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్సీ కవిత. పార్టీలో ఉండే కొంతమందికి కవిత అంటే అసలు పడలేదని వినిపిస్తున్నాయి దీంతో తన తండ్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కు కొన్ని కండిషన్స్ పెట్టిందట. వాటిని ఒప్పుకుంటేనే తాను పార్టీలో ఉంటానని తేల్చి చెప్పినట్లు మీడియా కథనాలు వినిపిస్తున్నాయి.

మొదటి డిమాండ్ గా తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కేసీఆర్ ను కోరిందట. ప్రెసిడెంట్ లేదా అందుకు సంబంధించిన హోదా ఇవ్వాలని అడిగినట్లు కథలు వినిపిస్తున్నాయి.


అలాగే మరొక అంశం ఏమిటంటే తనను జైలుకు పంపించి ఇబ్బందులు పెట్టిన బిజెపి పార్టీతో ఎప్పటికీ కూడా పొత్తు పెట్టుకోకూడదని ఆ విషయం పైన తనకు క్లారిటీ ఇవ్వాలని అడిగిందట. ఈ విషయాల పైన వేదికల పైన కూడా క్లారిటీ ఇవ్వాలని తెలిపిందట.

మరొక అంశం ఏమిటంటే కెసిఆర్ కు రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందనే విషయంపై కవిత డిమాండ్ చేసిందట.. ఈమెరకు ఫామ్ హౌస్ లో కలిసిన తర్వాత ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలతో ఆమె మాట్లాడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. వారి పేర్లు కూడా బయట పెట్టాలని డిమాండ్ చేసిందట.



మరొక డిమాండ్ ఏమిటంటే 2018 అసెంబ్లీలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలలో బిజెపి పార్టీ వారు విజయాన్ని అందుకున్నారు.. అనంతరం కొన్ని నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికలలో కూడా కవిత ఓడిపోయారు.. అయితే కొంతమంది వెన్నుపోటు వల్లే తాను ఓడిపోయానని ఆమె వాదన వినిపిస్తోంది. అలా తన నియోజకవర్గంలో ఇన్చార్జిలో బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేసిందట.


నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో తాను కోరుకున్న వారికి ఇన్చార్జి పదవులు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసిందట.

తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ బోనాల తో చేపట్టిన సంస్కృతి బిఆర్ఎస్ పార్టీకి బాగా కలిసి వచ్చిందని ఈ నేపథ్యంలోనే ఐదు నుంచి పదిమంది జాగృతి నేతలను ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించాలని కవిత డిమాండ్ చేసినట్లు మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.


వీటన్నిటికీ ఒప్పుకుంటేనే తాను పార్టీలో ఉంటానని డిమాండ్ చేసినట్లు కథలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: