2024 ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి అనుకూల ఫలితాలు సాధించడం ఒకింత సంచలనం అయింది. వైఎస్ జగన్ హవా తగ్గిందని చెప్పడానికి ఇంతకు మించిన ప్రూఫ్ అవసరం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. కడపలో మహానాడు హిట్టైతే వైసీపీ పునాదులు కదిలినట్లే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
వరుణ దేవుడు సైతం శాంతించడంతో మహానాడుకు ఉన్న ఆటంకాలు అన్నీ తొలగిపోయినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 29వ తేదీన మహానాడుకు ఏకంగా 5 లక్షల మంది హాజరు కానున్నారని తెలుస్తోంది. ఆ స్థాయిలో జనాభా హాజరైతే మాత్రం మాత్రం సంచలనం అవుతుంది. త్వరలో కూటమి సర్కార్ సంక్షేమ పథకాలను సైతం అమలు చేయనున్న సంగతి తెలిసిందే.
 
కడపలో మహానాడు హిట్టైతే కూటమి ఫ్లాపైతే వైసీపీ సక్సెస్ సాధిస్తుంది. ఈ రెండు పార్టీలలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంటుందనే ప్రశ్నకు సంబంధించి త్వరలోనే జవాబు దొరకనుంది. మహానాడుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం కమడ ఎమ్మెల్యే కూడా టీడీపీకి చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. అయితే మహానాడుకు సంబంధించిన యాడ్స్ లో పవన్ ఫోటో కనిపించకపోవడం గమనార్హం.
 
మహానాడు ఈవెంట్ లో విందు భోజనాలను సైతం భారీ స్థాయిలో ప్లాన్ చేశారని ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఫుడ్ మెనూలో వంటకాలను వడ్డించనున్నారని సమాచారం అందుతోంది. మహానాడు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయితే ఆ తర్వాత కూటమి ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో కూటమి మరింత పుంజుకోవాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 


మరింత సమాచారం తెలుసుకోండి: