ఐపీఎల్ లో ఆర్సిబి కప్పు గెలవాలనేది దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల కల.ఆ కల 2025లో నెరవేరింది. కానీ ఆ కల నెరవేరిన ఆనందం అభిమానుల్లో ఏమాత్రం కనిపించలేదు. ఎందుకంటే ఏ క్రికెట్ టీం గెలిచినా కూడా ఆ క్రికెట్ టీం వారి రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల్లో ట్రోఫీతో విక్టరీ పరేడ్ లో పాల్గొంటారు. అలా ఆర్సిబి కప్పు గెలవడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ పరేడ్ లో పాల్గొన్నారు.అయితే ఈ విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మృతి చెందడమే కాకుండా ఎంతో మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన చాలా బాధాకరం. ఇప్పటికే దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతూ కోహ్లీని కూడా అరెస్టు చేయండి అని సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు పెడుతున్నారు.

ఇక కర్ణాటక ప్రభుత్వం కూడా ఓ నలుగురిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది.అయితే తాజాగా ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ తొక్కీసలాట జరగడానికి కారణం అదేనట. అలాగే ఈ తొక్కిసలాట వెనుక మాజీ సీఎం మనవడి హస్తం కూడా ఉందని తెలుస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. ఎప్పుడైతే rcb కప్పు గెలిచిందో ఆ తర్వాత వెంటనే కొంత మంది సోషల్ మీడియాలో స్టేడియంలోకి వెళ్లడానికి టికెట్లు ఇస్తున్నారని ప్రచారం చేశారట. దీంతో ఈ విషయం నమ్మిన చాలా మంది ప్రజలు పెద్ద ఎత్తున ఆ స్టేడియం దగ్గరికి పరుగులు పెట్టారట. 

అలాగే ఫ్రీ పాసులు ఇస్తున్నారని కూడా ఒక మ్యాటర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలామంది ఉచిత పాసులు అని తెలిసి చిన్న స్వామి స్టేడియం దగ్గరికి పరుగులు పెట్టారట. అయితే ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలో కర్ణాటక మాజీ సీఎం మనవడి హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే విక్టరీ పరేడ్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తారని తెలిసినా కూడా ఇంటలిజెన్స్ నిద్రపోయినట్టే వ్యవహరించింది.అంతేకాకుండా అభిమానులు లక్షల్లో వస్తారని తెలిసి కూడా స్టేడియం గేట్లు ఎందుకు మూసివేసారు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. 

ఇప్పటికే డిఎన్ఏ సంస్థ యజమాని వెంకట్ మీద, ఆర్సిబి మీద,కర్ణాటక రాష్ట్ర సంఘం మీద,మాజీ సీఎం మనవడి మీద కేసులు ఫైల్ అయ్యాయి. వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకొని మరిన్ని విషయాలు బయటికి వచ్చేలా విచారణ చేస్తున్నారు.ఇక 11 మంది మరణించడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు వెళుతుంది.ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం కొంతమంది కావాలనే ఈ పని చేశారని కర్ణాటక జనం మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: