- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణలో మొత్తం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వ‌చ్చి యేడాదిన్న‌ర అవుతోంది. ఇప్పటికీ చేసి చివరికి మూడు మంత్రి పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు, ఎస్సీ , బీసీలకు ఈ పెదవులు ఇస్తున్నారు. మాల సామాజిక వ‌ర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ , మాదిగ వర్గం నుంచి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ , బీసీ వర్గం నుంచి ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరికి ఛాన్స్ ఇస్తున్నారు. మరి మూడు పదవులు ఎందుకు ఖాళీగా ? పెడుతున్నారు అంటే పార్టీ నేతల హెచ్చరికలు బెదిరింపులు తట్టుకోలేక పక్కన పెడుతున్నారు అన్న టాకు వినిపిస్తోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు. మూడు మంత్రి పదవులు ఎందుకు భర్తీ చేయడం లేదు ? అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతల బెదిరింపులకు తలొగ్గిపోతున్నారు. ఆయనకు మంత్రి ఇవ్వలేరు .. అలాగని ఇతరులకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.


రాజగోపాల్ రెడ్డి విషయానికొస్తే ఆయన కాంగ్రెస్ పార్టీని నానా ఇబ్బందులు పెట్టడానికే మునుగోడు ఉపఎన్నిక‌ తెచ్చారు. బిజెపికి వెళ్లి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుంది అన్న సంకేతాలు వచ్చాక పార్టీలో చేరారు. ఇలాంటి వాళ్ళకి కూడా కాంగ్రెస్ హై క‌మాండ్‌ ఎందుకు ? భయపడుతుందో అర్థం కావడం లేదన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పార్టీని నమ్ముకుని చాలామంది ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు - సుదర్శన్ రెడ్డి వారికి పదవులు ఇవ్వటానికి రాజగోపాల్ రెడ్డి లాంటి వారి బెదిరింపులు అడ్డం పడుతున్నాయి అన్న చర్చలు కూడా ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారు కూడా మంత్రి పదవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. పార్టీ హై క‌మాండ్‌ ఇంత బేలగా ఉంటే ఎలా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: