అన్నదాత సుఖీభవ ప‌థ‌కంపై బిగ్ అప్డేట్ వెలువ‌డింది. ఏపీ సర్కార్ ఈ స్కీమ్‌కు సంబంధించిన‌ నిధుల విడుదలకు తేదీ ఖ‌రారు చేసింది. పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం కింద ప్ర‌తి ఏడాది రైతుల ఖాతాల్లో రూ. 20 వేలు ప్ర‌భుత్వం జమ చేయనున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కేంద్ర ప్ర‌భుత్వం వాటా రూ. 6,000 కాగా... రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుల‌కు అందిస్తామ‌ని టీడీపీ-జ‌న‌సేన-బీజేపీ కూట‌మి ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఆ హామీని కూట‌మి స‌ర్కార్ నిల‌బెట్టుకోబోతుంది.


జూన్ 21న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం డ‌బ్బుల‌ను జ‌మ చేయ‌బోతుంది. ఈ మేర‌కు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న చేశారు. ఖ‌రీఫ్ ప‌నులు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం జూన్ 20న పీఎం కిసాన్ తొలి విడత‌ నిదులు విడుద‌ల చేయ‌బోతుంది. దీంతో ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం అప్ర‌మ‌త్త‌మైంది. కేంద్రం అందించే రూ. 2 వేలతో పాటు అన్నదాత సుఖీభవ ప‌థ‌కం కింద‌ రూ. 5 వేలు క‌లిసి మొత్తం రూ. 7 వేలు అర్హులైన రైతుల‌ అకౌంట్‌లో ఈ నెల 21న ప‌డేలా స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది.


మిగ‌తా మొత్తాన్ని మ‌రో రెండు విడ‌త‌ల్లో అందించ‌నున్నారు. అక్టోబ‌ర్‌లో రెండో విడ‌త‌గా కేంద్రం అందించే రూ. 2వేలకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 5 వేలు క‌లిపి పంపిణీ చేయ‌నుంది. అలాగే అఖ‌రి విడ‌త డ‌బ్బులు జ‌న‌వ‌రిలో రైతుల‌కు అంద‌నున్నాయి. అప్పుడు కేంద్రం నుంచి రూ.2వేలు, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి రూ. 4 వేలు రైతుల ఖాతాలో ప‌డ‌తాయ‌ని స‌మాచారం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: