పశ్చిమ ఆసియాలో యుద్ధ  వాతావరణం నెలకొంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను కూడా కాదని ఇరాన్ పై ఇజ్రాయేల్ భీకర దాడి చేసింది. ఇరాన్ యొక్క ఎయిర్ బేస్ ని ద్వంసం చేసి ఆ దేశం కోలుకోకుండా చేసింది. మొత్తం 250 యుద్ధ విమానాలతో దాడి చేయడంతో 20 మంది ఉన్నతాధికారులతో పాటు పలువురు కీలక సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో ఇజ్రాయేల్ పై ఇరాన్ కూడా డ్రోన్ దాడి చేసింది. ఈ డ్రోన్లను ముందుగానే పసిగట్టి వాటన్నింటిని మధ్యలోనే కూల్చివేసింది. ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయేల్ దాడులు చేసింది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయేల్ జెట్ ఫైటర్లు వరుస దాడులు చేసినట్టు తెలుస్తోంది. నతాంజు ప్రాంతంలోని అణుకేంద్రం వద్ద పేలుళ్లు జరగడంతో విపరీతమైనటువంటి పోగ మంటలు చెలరేగినట్టు సమాచారం. 

ఇజ్రాయేల్ చేతిలో తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ఇరాన్  ప్రతీకార చర్య తీసుకోవాలని  అనుకుంటుంది. దానికి సంబంధించి ఇరాన్ మసీదుపై జెండాను కూడా ఎగరవేసింది.. వివరాల్లోకి వెళ్తే.. గతంలో రాజుల మధ్య యుద్ధాలు జరిగేవి. అలాగే దేవుళ్ళు, రాక్షసుల మధ్య కూడా యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతుంది. ఈ యుద్ధాల సమయంలో రథాలకు పెద్దపెద్ద జెండాలు కట్టుకొని యుద్ధంలోకి దిగేవారు. ముఖ్యంగా మహాభారత యుద్ధం. ఇందులో అర్జునుడికి సారథిగా కృష్ణుడు ఉంటే కపిధ్వజం  హనుమంతుడు యొక్క జెండా ఉండేది. అంటే ఈ యుద్ధంలో హనుమంతుడు సహకారం తీసుకున్నారని మహాభారతంలో చెప్పబడింది.

కాలం మారినాకొలది కొంతమంది యుద్ధాల సమయంలో జెండాలు వాడడం అయితే చూస్తున్నాం. ముఖ్యంగా బాహుబలి సినిమాలో యుద్ధం జరిగే సమయంలో కూడా జెండాలు వాడారు. ఆ విధంగానే ఇరాన్ కూడా   ఆ విధంగానే ఎవరైనా దాడులు చేస్తే ప్రతీకార చర్యలు తీసుకుంటాం అనే సమయానికి వాళ్ల మసీదుపై ఎర్రజెండా ఎగరవేస్తారు. అయితే తాజాగా ఇరాన్ వారి యొక్క మసీదుపై ఎర్రజెండా ఎగరవేసి యుద్ధానికి సిద్ధమంటూ సిగ్నల్స్ ఇచ్చింది. తప్పకుండా ఇజ్రాయేల్ పై దాడి చేస్తామని, ప్రతీకార చర్య తీసుకుని ఇజ్రాయేల్ ని నాశనం చేస్తామనే విధంగా అక్కడి ప్రజలకు భరోసా కల్పించింది. మళ్లీ ఇజ్రాయిల్ పై దాడి చేసి శత్రువుపై ప్రతికార చర్య తీసుకున్న తర్వాతే ఆ జెండాను మళ్లీ తీసేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: